»   » తెలుగులో ఈ సమ్మర్ తొలి హిట్ ఇదే: ఇవిగో కలెక్షన్స్

తెలుగులో ఈ సమ్మర్ తొలి హిట్ ఇదే: ఇవిగో కలెక్షన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాఘవ లారెన్స్ దర్శకత్వంలో కాంచన మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన కాంచన-2 (తెలుగులో 'గంగ') చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలను రాబడుతూ దూసుకుపోతోంది. ఈ చిత్రమే ఈ సంవత్సరం సమ్మర్ సూపర్ హిట్ తొలి తెలుగుగా చెప్తున్నారు. డబ్బింగ్ చిత్రమైనా కలెక్షన్స్ బాగుండటం నిర్మాతను ఆనందపరుస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మే 1 న గంగ చిత్రం 550 థియోటర్స్ లో తెలుగు మాట్లాడే ఈ రెండు రాష్ట్రాల్లోనూ విడుదలైంది. ఇప్పటివరకూ 17.6 కోట్లు కలెక్టు చేసిందని అంచనా. 17 రోజులకు ఓ డబ్బింగ్ చిత్రం ఈ రేంజిలో కలెక్టు చేయటం ఆశ్చర్యపరుస్తోంది. 16.5 కోట్లకు ఈ చిత్రం థియోటర్ రైట్స్ అమ్మారు. దాంతో లాభాల్లో పడిపోయినట్లే అంటున్నారు. డిస్ట్రిబ్యూట్ చేస్తున్నవారు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేని లారెన్స‌తో పాటు తాప్సీకి కూడా ఈ చిత్ర విజయం మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. సినిమాలో కామెడీ ఎలిమెంట్స్, హారర్ ఎలిమెంట్స్ ఆకట్టుకునే విధంగా ఉండటంతో సినిమా చూడటానికి థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. సినిమా చూసిన వారంతా మంచి వినోదాత్మక చిత్రంగా ప్రశంసిస్తున్నారు. ఈ సినిమా విజయం సాధించడంతో...దీనికి సీక్వెల్ గా మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు లారెన్స్.

 Lawrence Ganga : Collections (Share)

ఏరియా ఇప్పటివరకూ షేర్ ( కోట్లలో )

నైజాం 5.55

సీడెడ్ 3.40

నెల్లూరు 0.71

కృష్ణా 1.23

గుంటూరు 1.72

వైజాగ్ 2.10

తూర్పు గోదావిరి 1.50

పశ్చిమ గోదావరి 1.39

మొత్తం ఎపి & తెలంగాణా షేర్ 17.6

కామెడీ అండ్ హారర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ చిత్రం తమిళ వెర్షన్ తాజాగా రూ. 50 కోట్ల మార్కును అందుకుంది. తమిళనాడు, కేరళ, కర్నాటకలో రెండు వారాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ భారీ మొత్తంలో వసూళ్లు చేసి లాభాలు తేవడంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉన్నారు. తెలుగు వెర్షన్ 'గంగ' కూడా వసూళ్లు పరంగా డిస్ట్రిబ్యూటర్లకు సంతృప్తిని మిగిల్చింది. మొత్తం కలిపితే ఈ వసూళ్లు రూ. 50 కోట్ల పైనే ఉంటుందని అంచనా.

రాఘవ లెరెన్స్, తాప్సీ జంటగా నటించిన ఈ భారీ చిత్రానికి ఫోటోగ్రఫీ: కిచ్చా, సంగీతం: థమన్, సమర్పణ: మల్టీ డైమన్షన్ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాతలు: బెల్లంకొండ సురేష్, బెల్లకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-కొరియోగ్రఫీ-దర్శకత్వం: రాఘవ లారెన్స్.

English summary
Raghava Lawrence movie "Ganga" collected approximately 17.6 cr crore at the AP/T box office by end of 17 days run.
Please Wait while comments are loading...