Leader Closing Collections: లీడర్ మూవీ క్లోజింగ్ కలెక్షన్లు.. లాభమెంత? నష్టమెంత?
శరవణ స్టోర్స్ అధినేత, తమిళనాడులో ప్రముఖ వ్యాపారవేత్త లెజెండ్ శరవణన్ హీరోగానే కాకుండా నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం లీడర్. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు ఆర్ఎస్ సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో షామ్, ఆండ్రియా జెర్మియా, పాయల్ రాజ్‌పుత్, సంతోష్ ప్రతాప్, అమృతా అయ్యర్, వీటీవీ గణేష్, జార్జ్ మార్యన్ తదితరులు నటించారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. వెంకటేష్ ఎస్ సినిమాటోగ్రఫిని, ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటింగ్, జిబ్రాన్ వైబోధా సంగీతం అందించారు. లెజెండ్ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 3వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమా వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

యాక్షన్, ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాను లావీష్‌గా తెరకెక్కించారు. జార్జియా, జైపూర్, చెన్నై, తూతుకూడి ప్రాంతాల్లో భారీగా చిత్రీకరించారు. ఈ సినిమాలో నటించిన నటీనటులు, పనిచేసిన సాంకేతిక నిపుణులు రెమ్యునరేషన్లు కలిపి మొత్తంగా 50 కోట్ల రూపాయలు మేర అయింది. ప్రమోషనల్ ఖర్చులతో కలిపి మొత్తంగా 55 కోట్ల రూపాయలు అయింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ సుమారుగా 20 కోట్ల రూపాయలు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
యాక్షన్, స్పై థ్రిల్లర్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో రూపొందిన ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచి సానుకూలమైన స్పందన వచ్చింది. ఈ చిత్రంలో శరవణన్ చూపించిన పెర్ఫార్మెన్స్, డైరెక్టర్ అనుసరించిన స్క్రీన్ ప్లే, కథలోని ట్విస్టులు మంచి థ్రిల్‌ను అందించాయి. అయితే బాక్సాఫీస్ వద్ద కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని అందరూ ఆశించారు. కానీ ఈ సినిమా ఆశించిన మేరకు కలెక్షన్లపరంగా పెర్ఫార్మ్ చేయలేకపోవడం ట్రేడ్ వర్గాలను షాక్ గురి చేశాయి.
లీడర్ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 1 కోటి రూపాయలు, రెండో రోజు 1.25 కోట్ల రూపాయలు, మూడో రోజు 1.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తొలి వారాంతం తర్వాత ఈ మూవీ వసూళ్లు పుంజుకోలేకపోయాయి. తొలివారం ముగిసే సమయానికి 4.5 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది. ఇక రెండో వారం విషయానికి వస్తే.. అంతగా రాబట్టలేకపోయింది. దాంతో రెండు వారాల్లో 15 కోట్ల రూపాయల నెట్ వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
లీడర్ సినిమా టోటల్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం ఇండియాలో 25 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను, 15 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. అయితే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఈ సినిమాపై పబ్లిక్ అంతగా ఆసక్తిని కనబరచలేకపోయారు. ఈ సినిమాను మరో డేట్‌లో రిలీజ్ చేసి ఉంటే.. మంచి ఫలితాన్ని సాధించడానికి పుష్కలంగా అవకాశం ఉన్న చిత్రం అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.


Click it and Unblock the Notifications