Leader Movie Box Office: లెజెండ్ శరవణన్ మూవీకి షాకింగ్ కలెక్షన్లు.. లీడర్ మూవీకి ఎన్ని కోట్లంటే?
శరవణ స్టోర్స్ అధినేత, తమిళనాడులో ప్రముఖ వ్యాపారవేత్త లెజెండ్ శరవణన్ హీరోగానే కాకుండా నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం లీడర్. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు ఆర్ఎస్ సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో షామ్, ఆండ్రియా జెర్మియా, పాయల్ రాజ్‌పుత్, సంతోష్ ప్రతాప్, అమృతా అయ్యర్, వీటీవీ గణేష్, జార్జ్ మార్యన్ తదితరులు నటించారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. వెంకటేష్ ఎస్ సినిమాటోగ్రఫిని, ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటింగ్, జిబ్రాన్ వైబోధా సంగీతం అందించారు. లెజెండ్ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 3వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమా వసూలు చేస్తున్న కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

యాక్షన్, ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాను లావీష్‌గా తెరకెక్కించారు. జార్జియా, జైపూర్, చెన్నై, తూతుకూడి ప్రాంతాల్లో భారీగా చిత్రీకరించారు. ఈ సినిమాలో నటించిన నటీనటులు, పనిచేసిన సాంకేతిక నిపుణులు రెమ్యునరేషన్లు కలిపి మొత్తంగా 50 కోట్ల రూపాయలు మేర అయింది. ప్రమోషనల్ ఖర్చులతో కలిపి మొత్తంగా 55 కోట్ల రూపాయలు అయింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ సుమారుగా 20 కోట్ల రూపాయలు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఈ సినిమా రిలీజ్ తర్వాత పాజిటివ్ టాక్, పాజిటివ్ రివ్యూస్ రావడంతో కలెక్షన్లు ఊపందుకొన్నాయి. ఈ సినిమా సాయంత్రం షోలకు చెన్నై, తమిళనాడులో మంచి రెస్సాన్స్ కనిపిస్తున్నది. ఈ సినిమా తమిళనాడులో ఈ సినిమా 1 కోటి రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో 50 లక్షలు, వరల్డ్ వైడ్ ఈ మూవీ 2 కోట్ల నుంచి 2.5 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











