3 రోజుల్లో 330 కోట్ల కలెక్షన్లు.. బాక్సాఫీస్ వద్ద హారర్ థ్రిల్లర్ జోరు

హాలీవుడ్‌లో పాపులర్ హారర్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ ది మమ్మీ సినిమాకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఈ ఫ్రాంచైజీలో భాగంగా తాజాగా వచ్చిన చిత్రం లీ క్రానిన్స్‌ ది మమ్మీ. ల క్రానిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాక్ రేనార్, లైయా కోస్టా, నాటాలీ గ్రేస్, వెరోనికా ఫాల్కన్, మే కాలమావీ తదితరులు నటించారు. ఈ సినిమాను జేమ్స్ వాన్, జాసన్ బ్లమ్, జాన్ కెవిల్లే నిర్మించారు.

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎదురు చూస్తున్న ఈ చిత్రం సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి: డేవ్ గార్బెట్, ఎడిటింగ్: బ్రయాన్ షా, మ్యూజిక్: స్టీఫెన్ మెకెన్ అందించారు. ఈ చిత్రం ఏప్రిల్ 1వ తేదీన వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా వసూలు చేస్తున్న కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

lee cronin s the mummy box office collections

న్యూలైన్ సినిమా, బ్లమ్‌హౌస్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రంలో సాంకేతిక అంశాలకు ఎక్కువగా ప్రాధాన్యం అందించారు. ఈ సినిమాలో నటించిన నటీనటులు, పనిచేసిన టెక్నిషియన్స్, ప్రమోషనల్ ఖర్చులన్నీ కలిపి ఈ చిత్రాన్ని సుమారుగా 22 మిలియన్ డాలర్లు అంటే.. 200 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీ వివరాలు ఇలా ఉన్నాయి.

ఇండియాలో ఈ చిత్రం ఇంగ్లీష్ వెర్షన్‌ను 190 పట్టణాల్లో 650 లోకేషన్లలో దాదాపు 725 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇక తెలుగు వెర్షన్ విషయానికి వస్తే.. ఆంధ్రా, నైజాంలోని 100కుపైగా ప్రధాన పట్టణాల్లోని 175 లోకేషన్లలో 200 స్క్రీన్లలో ప్రదర్వించారు. ఇక తమిళ వెర్షన్ విషయానికి వస్తే.. 76 పట్టణాల్లో 200 ప్రదేశాల్లో 250 స్క్రీన్లలో ప్రదర్శించారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇండియాలో ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇంగ్లీష్ వెర్షన్ తొలి రోజు 1.2 కోట్ల రూపాయలు, రెండో రోజు 1.80 కోట్లు, మూడో రోజు 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. గత మూడు రోజుల్లో 5 కోట్ల రూపాయల మేర కలెక్షన్లను సాధించింది. ఇక తెలుగు వెర్షన్ విషయానికి వస్తే.. తొలి రోజు 50 లక్షలు, రెండో రోజు 40 లక్షలు, మూడో రోజు 50 లక్షల రూపాయలతో మొత్తంగా 1.4 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక తమిళ వెర్షన్ విషయానికి వస్తే.. తొలి రోజు 40 లక్షలు, రెండో రోజు 60 లక్షలు, మూడో రోజు 70 లక్షల రూపాయలతో 1.7 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఇండియాలో గత మూడు రోజుల్లో 8.10 కోట్ల రూపాయలు రాబట్టింది.

ఈ సినిమా నార్త్ అమెరికాలోను, ఇతర దేశాల్లో ఓ మోస్తారుగా కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రం కెనడా, అమెరికాలో కలిపి 13.5 మిలియన్లు, యూకే, మెక్సికో, ఇతర దేశాల్లో 21 మిలియన్ డాలర్లు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రం ఓవర్సీస్‌ 34.5 మిలియన్ డాలర్లు అంటే.. భారతీయ కరెన్సీలో సుమారుగా 320 కోట్ల రూపాయలు వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా 330 కోట్ల రూపాయల మేర వసూళ్లను సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X