twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హిట్ ఎఫెక్ట్: 'లెజెండ్‌' శాటిలైట్ రేట్స్ పెరిగింది

    By Srikanya
    |

    హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో రూపొందిన "లెజెండ్'' చిత్రం మాస్ తో పాటు క్లాస్ ఫ్యామిలీ అడియెన్స్ ను కూడా ఆకట్టు కుంటూ ముందుకు దూసుకు పోతున్న సంగతి తెలిసిందే. దాంతో ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ సైతం పెరిగినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని ఆరు కోట్లకు ఫైనలైజ్ చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. రిలీజ్ కు ముందు వేరే రేటు అనుకున్నా ...తర్వాత ట్రాయ్ పెట్టిన రూల్ తో యాడ్ టైమింగ్ లు తగ్గటంలో రేట్లు తగ్గాయి. ఆ ఇంపాక్ట్ లెజండ్ పై పడింది. అయితే విజయవంతమైన నేపధ్యంలో చిత్రం మంచి రేటే వచ్చినట్లు చెప్తన్నారు.

    ఒక సినిమా బుల్లితెరపై ప్రసార సమయంలో గంటకు 15 నిమిషాల ప్రకటనలు ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిబంధనలు విధించడంతో, ఆ నిబంధన శాటిలైట్ సినిమాలపై పిడుగులా పడింది. అందువల్లకూడా శాటిలైట్ సినిమాలను కొనుగోలు చేయడానికి చానల్స్ ముందుకు రావడంలేదు. కానీ లెజండ్ లాంటి హిట్టైన సినిమాలకు అది మినహాయింపులా కనపడుతోంది. ఛానెల్ వారు రేటు రికవరీ అవుతుందని భావించి తీసుకుంటున్నారు.

    Legend gets good satellite offer

    2014లో సరైన హిట్టు ఒక్కటీ లేదే అనుకుంటున్న తరుణంలో సరిగ్గా బోయపాటి 'లెజెండ్‌'ని రంగంలోకి దించాడు. ఈ ఏడాదిలోనే బ్లాక్‌బస్టర్‌ హిట్‌ని పరిశ్రమకు ఇచ్చాడు. అటు ప్రేక్షకుల్ని కేరింతలు కొట్టించాడు. ఈ క్రెడిట్‌ పూర్తిగా నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనులదే. బాలయ్యలో అసలైన సింహాన్ని తెరపైకి తెచ్చాడు. యాక్షన్‌లో ఉగ్రనరసింహుడిని చూపించాడని ఫ్యాన్స్ అంటున్నారు. లెజెండ్‌ గర్జనతో థియోటర్స్ మార్మోగిపోతున్నాయి. కుటుంబ ప్రేక్షకుల కోసం చక్కని సెంటిమెంట్‌ రంగరించి వదలటం ప్లస్ అయ్యింది.

    ముఖ్యంగా సెకండాఫ్ లో సెంటిమెంట్‌, ట్రెయిన్‌ ట్రాక్‌పై ఎపిసోడ్‌లో ప్రేమ సన్నివేశం ప్రేక్షకుడి గుండె పగిలిపోయే ఉద్వేగాన్ని ఇచ్చాయి. గుడిమెట్లపై బాలయ్య ఉగ్రరూపం యాక్షన్‌కే కొత్త హంగులు అద్దిందని అంతటా వినపడుతోంది. మాస్‌ యాక్షన్‌ ప్రియులకు ఇదో కన్నుల పండుగగా మారింది.

    ముఖ్యంగా రాజకీయాలు పుట్టిందే మా వంశంలో రా.. అని బాలయ్య గర్జించిన తీరు విశ్వనటసా ర్వభౌముడు ఎన్టీఆర్‌ని తలపించింది. లెక్కకు మిక్కిలిగా బాలయ్య విసిరిన పంచ్‌లకు థియేటర్లలో విజిల్స్‌ పడుతున్నాయి. ఇటు అభిమానులే కాక, అటు సామాన్య ప్రేక్షకుల్లోనూ హుషారు తెచ్చింది ఈ సినిమా. ఏపీతో పాటు చెన్నయ్‌, బెంగళూరు, విదేశాల్లో ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తోందని సమాచారం. వారాహి చలనచిత్రం, 14రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి

    వారాహి చలన చిత్రం, 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ నిర్మాణ సంస్థలకు "లెజెండ్'' చిత్రం మరో భారీ హిట్ ను అందించింది. అలాగే దర్శకుడు బోయపాటి శ్రీనుపై పరిశ్రమ వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కేవలం ఆంధ్ర-తెలంగాణా ప్రాంతాల్లో నే కాకుండా ఓవర్ సీస్ లోనూ "లెజెండ్'' చిత్రం విజయఢంకా మ్రోగిస్తోందని వారు తెలిపారు.

    English summary
    ‘Legend’ has received a very good satellite rights price. The rights were sold for a price of 6 Crores. The film has been directed by Boyapati Sreenu and Devi Sri Prasad composed the music.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X