కేక పుట్టిస్తున్న బాలయ్య: ‘లెజెండ్’ 175 డేస్...
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ నటించిన ‘లెజెండ్' చిత్రం భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 100 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా 175 డేస్ మార్కును అందుకుంది. ఎమ్మిగనూరులోని మిని శివ థియేటర్లో డైరెక్ట్ 4 ఆటలతో 175 రోజులు పూర్తి చేసుకుంది. అదే విధంగా షిప్ట్ 4 ఆటలతో ప్రొద్దుటూరు ఆర్వేటిలో 56 రోజులు, అర్చనలో 119వ రోజు రన్ అవుతోంది.
మార్చి 28న రిలీజ్ అయిన బాలయ్య చిత్రం సరిగ్గా జులై 5తో 100 రోజుల కంప్లీట్ చేసుకుంది. బాలయ్య నట విశ్వరూపం, బోయపాటి దర్శకత్వ ప్రతిభ, జగపతి బాబు విలనిజం వెరసి లెజెండ్‌ని లెజెండరీ హిట్ గా నిలిపాయి. దేవిశ్రీ ప్రసాద్ తొలిసారిగా బాలయ్య చిత్రానికి సంగీతం అందించిన ఈ లెజెండ్ మ్యూజికల్ హిట్ గా నిలవడమే కాకుండా రీ రికార్డింగ్ ని కూడా అద్భుతంగా ఇచ్చాడు దేవి. లెజెండ్ విజయంపై బాలయ్య అభిమానులు హ్యాపీగా ఉన్నారు.

భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు గోపీచంద్ ఆచంట రామ్ ఆచంట,అనిల్ సుంకర. శాటిలైట్ రైట్స్, థియేట్రికల్ష్ రైట్స్ కలుపుకుని ఈ చిత్రం నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చి పెట్టింది. ఈ చిత్రంలో బాలయ్య సరసన రాధిక ఆప్టే, సోనాల్ చౌహన్ నటించారు. 'లెజెండ్' చిత్రం 31 సెంటర్లలో 100 రోజుల వేడుక జరుపుకున్న సంగతి తెలిసిందే.
కాగా...‘లెజెండ్' నిర్మాతలు గోపీచంద్ ఆచంట రామ్ ఆచంట,అనిల్ సుంకర 14రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ బేనర్లో తెరకెక్కించిన ‘ఆగడు' చిత్రం రేపు(సెప్టెంబర్ 19)న గ్రాండ్‌గా విడుదలవుతోంది.


Click it and Unblock the Notifications











