'లెజెండ్' 20 నిముషాలు ట్రిమ్ చేసారు
హైదరాబాద్: బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'లెజెండ్'. బాలకృష్ణ హీరోగా నటించారు. ఈ చిత్రం సెన్సార్ కి వెళ్లక ముందే ఫైనల్ వెర్షన్ చూసి ఇరవై నిముషాలు ట్రిమ్ చేసారని సినీ వర్గాల సమాచారం. ఎక్కడా కొంచెం కూడా లాగ్ గానీ బోర్ కానీ లేకుండా టైట్ గా సినిమా ఆధ్యంతం పరుగెత్తాలా ఉండటం కోసం ట్రిమ్ చేసారని తెలుస్తోంది. మొదట ఈ చిత్రం రెండు గంటల 55 నిముషాలు అనుకున్నారని, ఇప్పుడు రెండు గంటల 35 నిముషాలు మాత్రమే ఉందని తెలుస్తోంది.
ఈ మధ్య కాలంలో ఏ బాలకృష్ణ చిత్రానికి రాని పాజిటివ్ క్రేజ్ ఈ చిత్రానికి వచ్చింది. చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. సోనాల్ చౌహాన్, రాధికా ఆప్టే హీరోయిన్స్. జగపతిబాబు విలన్ గా నటించారు. హంసానందిని ప్రత్యేకగీతంలో ఆడిపాడింది. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయి కొర్రపాటి సమర్పకులు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెలాఖరున చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

తన దారికి ఎవ్వరూ అడ్డు రాకూడదు. వేరొకరి దారికి అతను అడ్డుగా వచ్చే పరిస్థితి తెచ్చుకోకూడదు. ఎదుటివారి పవర్ అయినా... పొగరైనా ఆయన అడుగుపెట్టేవరకే. ఒక్కసారి రంగంలోకి దిగాడంటే... చరిత్ర అంతా మారిపోతుంది. ఇంతకీ అతనెవరో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు బోయపాటి శ్రీను.
నిర్మాతలు మాట్లాడుతూ ''బాలకృష్ణ విజృంభణకు అద్దంపట్టే మరో చిత్రమిది. ఎదురులేని మనిషిగా ఆయన అభినయం ఆకట్టుకుంటుంది. ఇటీవల విడుదలైన పాటలకు చక్కటి స్పందన లభించింది. త్వరలోనే చిత్రాన్ని సెన్సార్‌కి పంపుతున్నాం'' అన్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. \
'సింహా'కి రెండోవైపు కూడా చూపించి అభిమానుల్ని మురిపిద్దామనుకొంటున్నారు. అందుకే 'లెజెండ్' చిత్రానికి ఆయన 'లయన్ ఈజ్ బ్యాక్' అనే ఉపశీర్షిక పెట్టారు. మరోసారి విందు భోజనం వడ్డించే పనిలో ఉన్నారు. ఈ చిత్రానికి సంభందించి కొత్త పోస్టర్స్ ని విడుదల చేసి క్రేజ్ ని తారా స్ధాయికి తీసుకువెళ్తున్నారు.
'సింహా' కాంబినేషన్ అంటేనే అంచనాలు తీవ్రస్థాయిలో ఉంటాయి. దానికి తోడు టైటిల్ ఇట్టే ఆకర్షించేస్తోంది. 'లెజెండ్.. బాలయ్యబాబుకి సరిగ్గా సరిపోయే టైటిల్..' అని అభిమానులు ముచ్చటపడిపోతున్నారు. ఫస్ట్‌లుక్‌లో బాలయ్య అదరగొట్టాడు. మీసం, రాజసం, స్త్టెల్ ఇవన్నీ ఫ్యాన్స్‌కి బాగా నచ్చాయి. ఇక తెరపై తమ హీరో ఎలా ఉంటాడో..? అని వూహల్లోనే 'లెజెండ్' విశ్వరూపాన్ని దర్శించుకొంటున్నారు.


Click it and Unblock the Notifications











