Lenin 13 Days Box Office: లెనిన్ అరుదైన బాక్సాఫీస్ రికార్డు..అఖిల్ మూవీకి ఎన్ని కోట్లంటే?

అక్కినేని నట వారసుడు అఖిల్ అక్కినేని నటించిన లెనిన్ చిత్రం రెండో వారంలో కూడా నిలకడగా వసూళ్లను సాధిస్తున్నది. భాగ్య శ్రీ భోర్సే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో తొలి ఆట నుంచే భారీ వసూళ్లను రాబడుతున్నది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ సినిమా మొదటి వారం అఖిల్ కెరీర్‌లో రికార్డు కలెక్షన్లను సాధించింది.

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ నాగవంశీ, మన్మథుడు నాగార్జున అక్కినేని సంయుక్తంగా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఈ చిత్రాన్ని సుమారుగా 55 కోట్ల రూపాయలతో పూర్తి చేశారు. అఖిల్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా బిజినెస్ 22 కోట్ల మేర జరిగింది. ఈ చిత్రం 44 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ చిత్రం బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. అయితే ఈ చిత్రం గత 13 రోజుల్లో ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేసింది? ఈ చిత్రం 100 కోట్ల రూపాయల క్లబ్‌కు ఎంత దూరంలో ఉంది? అనే వివరాల్లోకి వెళితే...

Lenin Day 13 Box Office Collection

లెనిన్ సినిమా తెలుగు రాష్ట్రాల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా గత 12 రోజుల్లో నైజాంలో 13 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 4 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ఆంధ్రాలోని ప్రధాన జిల్లాలైన తూర్పు గోదావరి జిల్లాలో 3 కోట్ల రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 2 కోట్ల రూపాయలు, గుంటూరులో 2.5 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 2 కోట్ల రూపాయలు, నెల్లూరు జిల్లాలో 1.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా 32 కోట్ల రూపాయల షేర్, 46 కోట్ల రూపాయల నెట్, 50 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఇక కర్ణాటక, తమిళనాడు, ఇతర రాష్ట్రాల కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ చిత్రం తమిళనాడులో 1 కోటి రూపాయల నెట్, 2 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. కర్నాటకలో 5 కోట్ల రూపాయల నెట్, 7 కోట్ల రూపాయల గ్రాస్, ఇతర రాష్ట్రాల్లో 1 కోటి రూపాయల నెట్, 2 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఓవర్సీస్ కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ చిత్రం ఇప్పటి వరకు అమెరికాలో 800K డాలర్లు అంటే.. భారతీయ కరెన్సీలో 8 కోట్ల రూపాయల గ్రాస్, ఇతర దేశాల్లో కలిపి ఈ సినిమా 1.5 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 10 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా 71 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇదిలా ఉండగా, ఈ సినిమాకు సంబంధించిన కలెక్షన్ల వివరాలను నిర్మాతలు నాగవంశీ, నాగార్జున అక్కినేని అధికారికంగా వెల్లడించారు. ఈ సినిమా 11 రోజుల్లో 88 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని పేర్కొన్నారు. 12వ రోజు చిత్రం 2 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 12 రోజుల్లో 90 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక 13వ రోజు విషయానికి వస్తే.. ఈ చిత్రం మరో 2 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందనే అంచనా ట్రేడ్ వర్గాల్లో ఉంది. ఆ లెక్క ప్రకారం ఈ చిత్రం 92 కోట్ల రూపాయలు వసూలు చేసి 100 కోట్ల రూపాయలకు చేరువ కానున్నది.

Read more about: lenin akhil box office report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X