Lenin Box Office Collections: 5వ రోజు లెనిన్ బాక్సాఫీస్ జోరు.. అఖిల్ మూవీకి ఎన్ని కొట్లంటే?

అక్కినేని నట వారసుడు అఖిల్ నటించిన లెనిన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్నది. ఈ చిత్రం విడుదలైన ప్రతీ సెంటర్‌లోను రికార్డు వసూళ్లను నమోదు చేస్తున్నది. కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లకు లాభాలను పంచిపెడుతున్నది. ఈ సినిమా గత నాలుగు రోజులుగా ట్రేడ్ వర్గాల అంచనాలను మంచి కలెక్షన్లను వసూలు చేస్తున్నదని సినిమా నిర్మాతలు నాగార్జున, నాగవంశీ అధికారికంగా ప్రకటించారు. గత 4 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తొలి రోజు 7.15 కోట్ల రూపాయల నెట్, రెండో రోజు 8.65 కోట్ల రూపాయల నెట్, మూడో రోజు 9.65 కోట్ల రూపాయల నెట్, నాలుగో రోజు 3.6 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం 4 రోజుల్లో 29 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని సాక్ నిక్ వెల్లడించింది.

Lenin 5 Days Box Office Collections

ఇండియాలో కలెక్షన్ల విషయానికి వస్తే..ఈ సినిమా ఆంధ్రా, నైజాంలో కలిపి 29 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 3.5 కోట్ల రూపాయలు, తమిళనాడులో 50 లక్షలు, ఇతర రాష్ట్రాల్లో 50 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 33.5 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ చిత్రం ఓవర్సీస్‌లో ఈ సినిమా 550K డాలర్లు అంటే 5.3 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని శ్లోక ఎంటర్‌టైన్‌మెంట్ తెలిపింది.

లెనిన్ చిత్రం వరల్డ్ వైడ్ సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం తొలి రో జు 16.7 కోట్ల రూపాయల గ్రాస్, రెండో రోజు 14.7 కోట్ల గ్రాస్, మూడో రోజు 29.8 కోట్లు, నాలుగో రోజు 6.1 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 4 రోజుల్లో 67.2 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది అని అన్నపూర్ణ స్టూడియోస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది.

ఇక 5వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా నిలకడగా వసూళ్లను సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ చిత్రం 5వ రోజు 3.5 నుంచి 4 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. దాంతో ఈ సినిమా 70 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే జంటగా నటించిన లవ్, ఎమోషనల్, డివోషనల్ రూరల్ డ్రామా లెనిన్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. ఈ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పీ, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియో సమర్పిస్తున్నది. ఈ చిత్రంలో శివాజీ, రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, సునీల్, రమేశ్ ఇందిరా తదితరులు నటించారు.

ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే. సినిమాటోగ్రఫి: లియోన్ బ్రిట్టో, మ్యూజిక్ డైరెక్టర్: థమన్ ఎస్, ఎడిటర్: నవీన్ నూలీ, యాక్షన్ కోరియోగ్రఫి: దిలీప్ సుబ్బరాయన్, రామ్ లక్ష్మణ్, విజయ్, రియల్ సతీష్, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్ల, కొరియోగ్రఫి: దినేష్ మాస్టర్ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సినిమా జూలై 10వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది

Read more about: lenin akhil box office report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X