Lenin Box Office Collections: ఓవర్సీస్‌లో డీసెంట్ ఓపెనింగ్స్.. ఆంధ్రా, నైజాంలో కలెక్షన్ల పరిస్థితి ఏంటంటే?
యువ హీరో, హీరోయిన్లు అఖిల్, భాగ్యశ్రీ భోర్సే జంటగా నటించిన లవ్, ఎమోషనల్, డివోషనల్ రూరల్ డ్రామా లెనిన్. ఈ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పీ, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియో సమర్పిస్తున్నది. ఈ చిత్రంలో శివాజీ, రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, సునీల్, రమేశ్ ఇందిరా తదితరులు నటించారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే. సినిమాటోగ్రఫి: లియోన్ బ్రిట్టో, మ్యూజిక్ డైరెక్టర్: థమన్ ఎస్, ఎడిటర్: నవీన్ నూలీ, యాక్షన్ కోరియోగ్రఫి: దిలీప్ సుబ్బరాయన్, రామ్ లక్ష్మణ్, విజయ్, రియల్ సతీష్, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్ల, కొరియోగ్రఫి: దినేష్ మాస్టర్ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సినిమా జూలై 10వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. పాజిటివ్ బజ్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఇటీవల ప్రారంభమైంది. ఓవర్సీస్, తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వసూళ్లు ఎలా ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..

రూరల్, ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ప్రేమ కథా చిత్రం థియేట్రికల్ బిజినెస్ క్రేజీగా జరిగింది. ఈ సినిమా తెలుగు, కన్నడ రాష్ట్రాల హక్కులు 25 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ సుమారుగా 5 కోట్ల రూపాయల మేర వాల్యూ కట్టారు. దాంతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా 30 కోట్ల షేర్.. 60 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఈ సినిమా ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్‌కు మంచి రెస్సాన్స్ లభిస్తున్నది. ఈ సినిమా నార్త్ అమెరికా ప్రీ సేల్స్ విషయానికి వస్తే.. ప్రీమియర్స్ భారీగా ప్లాన్ చేశారు. ఈ సినిమాను 200 లోకేషన్లలో, 350కి పైగా షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు సుమారుగా 7 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. దాంతో ఈ సినిమా ఇప్పటి వరకు 90 వేల అమెరికన్ డాలర్లు అంటే.. 86 లక్షల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా ప్రీమియర్ల ద్వారా సుమారుగా 150K డాలర్లు వసూలు చేయవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇక తెలుగు రాష్ట్రాల్లో, కర్ణాటకలో కూడా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ భారీగానే నమోదు అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. సుమారుగా 1500 షోలు ప్రదర్శించేందుకు ప్లాన్ చేశారు. ఇప్పటి వరకు నైజాం, ఆంధ్రా, కర్ణాటక, ఇతర ప్రాంతాల్లో కలిపి సుమారుగా 1 లక్షకుపైగా టికెట్లు అమ్ముడుపోయాయి. తాజా సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఈ చిత్రం 1.7 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు చేశాయి అని ఆన్ లైన్ టికెటింగ్ ట్రాకింగ్ వెబ్‌సైట్స్ తెలిపాయి. ఏపీలో 70 లక్షల రూపాయలు, తెలంగాణలో 80 లక్షల రూపాయలు, కర్ణాటకలో 15 లక్షల రూపాయలు వసూలు చేసిందని తెలిపారు.
వరల్డ్ వైడ్ అడ్వాన్స్ బుకింగ్ విషయానికి వస్తే.. ఇప్పటి వరకు 2.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ చిత్రం ప్రీమియర్లు, తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ సుమారుగా 3 నుంచి 3.5 కోట్ల మేర వసూలు చేసే అవకాశం ఉంది. ఈ చిత్రం తొలి రోజు 8 నుంచి 10 కోట్ల గ్రాస్ వసూలు చేసే ఛాన్స్ కనిపిస్తున్నది. ఈ సినిమా బాక్సాఫీస్ రిపోర్ట్ కోసం ఫిల్మీబీట్ తెలుగును ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications