Lenin Day 3 AP, TG Box Office: అఖిల్ కెరీర్‌లో హయ్యెస్ట్ కలెక్షన్లు.. ఏపీ, నైజాంలో లెనిన్‌కు ఎన్ని కోట్లంటే?

అక్కినేని వారసుడు అఖిల్, యువ హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే జంటగా నటించిన లవ్, ఎమోషనల్, డివోషనల్ రూరల్ డ్రామా లెనిన్. ఈ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పీ, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియో సమర్పిస్తున్నది. ఈ చిత్రంలో శివాజీ, రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, సునీల్, రమేశ్ ఇందిరా తదితరులు నటించారు.

ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే. సినిమాటోగ్రఫి: లియోన్ బ్రిట్టో, మ్యూజిక్ డైరెక్టర్: థమన్ ఎస్, ఎడిటర్: నవీన్ నూలీ, యాక్షన్ కోరియోగ్రఫి: దిలీప్ సుబ్బరాయన్, రామ్ లక్ష్మణ్, విజయ్, రియల్ సతీష్, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్ల, కొరియోగ్రఫి: దినేష్ మాస్టర్ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సినిమా జూలై 10వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ చిత్రం గత రెండు రోజుల్లో ఆంధ్రా, తెలంగాణలో వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? 3వ రోజు పరిస్థితి ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..

Lenin Telugu States Box Office Collections

లెనిన్ సినిమాను భారీ తారాగణం, టాప్ టెక్నిషియన్స్‌తో రూపొందించిన ఈ సినిమాను బెస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో రూపొందించారు. ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కాస్ట్‌తో కలిపి ఈ సినిమాను సుమారుగా 55 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ సుమారుగా 22 కోట్ల రూపాయల మేర జరిగింది. ఈ సినిమా 23 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Also Read
The Odyssey Censor Report: ది ఒడిస్సీ మూవీ ఇండియన్ సెన్సార్ రిపోర్ట్
The Odyssey Censor Report: ది ఒడిస్సీ మూవీ ఇండియన్ సెన్సార్ రిపోర్ట్

లెనిన్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీగానే వసూళ్లను నమోదు చేసింది. ఏపీ, నైజాంలో ఈ చిత్రం తొలి రోజు సుమారుగా 6.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. తొలి రోజు ఆంధ్రాలో 3 కోట్ల రూపాయలు, తెలంగాణ, సీడెడ్‌లో కలిపి 3.5 కోట్ల రూపాయలు రాబట్టంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. రెండో రోజు ఈ సినిమా కలెక్షన్లు తొలి రోజు కంటే ఎక్కువగా నమోదు అయ్యాయి. రెండో రోజు 7.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆంధ్రాలో 3.5 కోట్ల రూపాయలు, నైజాం, సీడెడ్‌లో 4 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

Recommended For You
Hrudhayam Murali Review: హృదయం మురళీ రివ్యూ అండ్ రేటింగ్
Hrudhayam Murali Review: హృదయం మురళీ రివ్యూ అండ్ రేటింగ్

ఏపీ, తెలంగాణలో ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. గత రెండు రోజుల్లో ఈ సినిమా నైజాంలో 4 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 1.5 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 1.5 కోట్లు రూపాయలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 1.4 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 80 లక్షలు, గుంటూరులో 1.25 కోట్లు, కృష్ణా జిల్లాలో 80 లక్షలు, నెల్లూరులో 50 లక్షల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా గత రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 15 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని పేర్కొన్నాయి.

You May Also Like
Lenin Movie Review: లెనిన్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Lenin Movie Review: లెనిన్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఇక మూడో రోజు కూడా లెనిన్ సినిమా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా కనిపించింది. ఈ చిత్రం మరో 6 కోట్ల రూపాయలు వసూల చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా ఈవెనింగ్ షోలకు రెస్పాన్స్ పుంజుకొంటే ఈ రేంజ్ పెరిగే అవకాశం ఉంది. ఈ సినిమా తాజా సమాచారం ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్ల రూపాయల మార్కును దాటి బ్రేక్ ఈవెన్ సాధించేందుకు పరుగులు పెడుతున్నది. ఈ చిత్రం ఇప్పటి వరకు థియేట్రికల్‌గా 50 శాతం రికవరీని సాధించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

లెనిన్ సినిమా వరల్డ్ వైడ్‌గా గత రెండు రోజులుగా సాధించిన వసూళ్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 16.7 కోట్ల రూపాయలు, రెండో రోజు 21 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను రాట్టింది. దాంతో ఈ చిత్రం 37.2 కోట్లకు రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రం ఆదివారంతో 50 కోట్ల రూపాయల వసూళ్లను సాధించే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

Read more about: lenin akhil box office report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X