Vijay's Leo Collections భారీగా పడిపోయిన లియో కలెక్షన్లు.. టోటల్‌గా ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

తమిళ సూపర్ స్టార్ విజయ్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్‌ కాంబినేషన్‌లో వచ్చిన లియో చిత్రం బాక్సాఫీస్ వద్ద వారం రోజులుగా రికార్డు కలెక్షన్లు సాధించింది. అయితే తొలివారం తర్వాత ఈ సినిమా కలెక్షన్లపరంగా భారీగా క్షీణిస్తూ వస్తున్నది. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, త్రిషా తదితరులు నటించారు. అయితే ఈ సినిమా 8వ రోజు సాధించిన కలెక్షన్లు, ఏ మేరకు వసూళ్లు తగ్గాయనే వివరాల్లోకి వెళితే..

లియో చిత్రంలో స్టార్ హీరోలు కీలక పాత్రల్లో నటించడంతో మూవీ బడ్జెట్ భారీగానే అయింది. 300 కోట్ల రూపాయలతో రూపొందిన ఈ సినిమాను 34 దేశాల్లో 5600 కుపైగా స్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ సినిమా 420 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది. తొలి రోజు నుంచే రికార్డు వసూళ్లను సాధించడం ట్రేడ్ వర్గాల్లో జోష్ పుట్టించింది.

Leo 8 days official Collections Worldwide: Vijay movie heavy drop at Box office

లియో చిత్రం రోజు వారీ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 145 కోట్ల గ్రాస్, రెండో రోజు 65 కోట్ల గ్రాస్, మూడో రోజు 75 కోట్ల గ్రాస్, నాలుగో రోజు 70 కోట్ల గ్రాస్, 5వ రోజు 47 కోట్ల గ్రాస్, ఆరో రోజు 45 కోట్ల గ్రాస్, ఏడో రోజు 22 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

Leo 8 days official Collections Worldwide: Vijay movie heavy drop at Box office

లియో చిత్రం గత 7 రోజుల్లో భారీ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం ఇండియాలో 300 కోట్ల రూపాయలు వసూలు చేస్తే.. తమిళనాడులో 215 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించింది. ఏపీలో 40 కోట్లకుపైగా, కర్ణాటకలో 33 కోట్లు, కేరళలో 50 కోట్ల మేర, హిందీలో 16 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించింది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం 170 కోట్ల మేర వసూళ్లను సాధించింది.ఓవరాల్‌గా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 485 కోట్ల రూపాయల కనకవర్షం కురిపించింది.

దసరా సెలవులు ముగియడం లియో సినిమాపై భారీ ప్రభావం చూపించింది. 8వ రోజు ఓవరాల్‌గా 40 శాతం ఆక్యుపెన్సీ తమిళంలో నమోదైంది. తెలుగులో 35 శాతం ఆక్యుపెన్సీ, హిందీలో 15 శాతం, మలయాళంలో 35 శాతం, కన్నడలో 25 శాతం ఆక్యుపెన్సీ కనిపించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Leo 8 days official Collections Worldwide: Vijay movie heavy drop at Box office

ఇక 8వ రోజు లియో కలెక్షన్లు భారీగా పడిపోయాయి. గత 7 రోజుల కలెక్షన్లను చూస్తే 70 శాతం డ్రాప్ కనిపించింది. ఈ సినిమా గురువారం అంటే 8వ రోజు 18 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా 500 కోట్ల రూపాయలకుపైగా కలెక్ష్లనను సాధించింది.తమిళంలో ఇండస్ట్రీ హిట్ అంటూ లియోను ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X