Leo Day 4 Collections 400 కోట్లకు చేరువగా లియో.. బాక్సాఫీస్‌పై విజయ్ దండయాత్ర.. 4వ రోజు ఎన్ని కోట్లంటే?
ఇళయ దళపతి విజయ్, బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్, సౌతిండియన్ స్టార్ అర్జున్ సర్జా, అందాల భామ త్రిషా కృష్ణన్ నటించిన లియో చిత్రం బాక్సాఫీస్ వద్ద మెరుపులు మెరిపిస్తున్నది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) భాగంగా రూపొందిన ఈ సినిమాను ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ అంశాలతో లోకేష్ కనకరాజ్ రూపొందించారు. ఈ సినిమా విడుదలైన తొలి రోజు నుంచే టాక్, రివ్యూలతో సంబంధం లేకుండా కలెక్షన్ల పంట పండిస్తున్నది. ఈ సినిమా 4వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్
లియో సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. విజయ్ రెమ్యునరేషన్‌తోపాటు కలిపి మొత్తంగా 300 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా బిజినెస్ మొత్తంగా 220 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 5600 స్క్రీన్లలో, తమిళనాడులోనే 1100 స్క్రీన్లు ఏపీ, తెలంగాణలో 1000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

లియో తొలి రోజు కలెక్షన్లు
లియో సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో 36 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఇక తెలుగు, కర్ణాటక, కేరళ, హిందీ, ఇతర రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా ఇండియాలో 80 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో అంటే అమెరికా, కెనడా, బ్రిటన్, ఇతర దేశాల్లో కలిపి మొత్తంగా 145 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది.
లియో రెండో రోజు వసూళ్లు
లియో రెండో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో 25 కోట్ల రూపాయలు, తెలుగు, హిందీ, కర్ణాటక, కేరళ, ఇతర రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా మొత్తంగా 38 కోట్ల రూపాయలు వసూలు చేసంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రెండో రోజు 66వ కోట్ల రూపాయలు రాబట్టింది.
విజయ్ మూవీ 3వ రోజు బాక్సాఫీస్ రిపోర్టు
మూడో రోజు హీరో విజయ్ బాక్సాఫీస్ స్టామినాకు లియో సాక్ష్యంగా నిలిచింది. దసరా పండుగ రేసులో తనకు ఎదురే లేదంటూ కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. ఈ సినిమా తమిళనాడులో 30 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 85 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

4వ రోజు లియో బాక్సాఫీస్ కలెక్షన్లు
ఇక లియో సినిమా నాలుగో రోజు అంటే ఆదివారం సెలవు దినం కలిసి వచ్చింది. ఈ సినిమాకు తమిళనాడులో భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోను అదే జోరును కొనసాగించింది. దాంతో ఈ సినిమా మొత్తంగా 80 కోట్ల రూపాయలను ప్రపంచవ్యాప్తంగా సాధించింది. దాంతో ఈ సినిమా మొత్తంగా 4 రోజుల్లో 375 కోట్ల రూపాయలు నమోదు చేసే అవకాశం ఉంది. ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే 400 కోట్ల రూపాయలకు చేరువకావడం గమనార్హం.
లాభమా? నష్టమా?
లియో ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ లక్ష్యం 220 కోట్ల షేర్, 420 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించాల్సి ఉంది. ఈ సినిమా మరో రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంది. దసరా పండుగ సీజన్‌లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ సాధించే చిత్రాల్లో ముందు వరుసలో హీరో విజయ్ ఉన్నారనే చెప్పాలి.


Click it and Unblock the Notifications











