Leo Box office Report లియో కలెక్షన్ల ప్రభంజనం.. రజనీ జైలర్ రికార్డు బ్రేక్.. జవాన్‌కు ధీటుగా విజయ్ మూవీ!

స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, ఇళయ దళపతి విజయ్ కాంబినేషన్‌లో వచ్చిన లియో చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనాన్ని కొనసాగిస్తున్నది. సంజయ్ దత్, అర్జున్ సర్జా, త్రిషా, గౌతమ్ వాసుదేవ్ మీనన్ నటించిన ఈ సినిమా నెగిటివ్ టాక్‌లోను రికార్డు వసూళ్లను రాబడుతున్నది. ఈ సినిమా జైలర్, జవాన్ రేంజ్ కలెక్షన్లను సాధించడం చర్చనీయాంశమైంది. ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

తమిళంలో కలెక్షన్లు
లియో చిత్రం తమిళనాడులో కలెక్ష్లన్ల ప్రభంజనం సృష్టిస్తున్నది. తొలి ఆట నుంచే భారీ వసూళ్లను రాబడుతున్నది. డివైడ్ టాక్‌తో మూవీపై నెగిటివ్ ప్రభావం పడినా.. కలెక్షన్ల జోరుకు అడ్డుకట్ట వేయలేదు. తమిళంలో తొలి రోజు 49 కోట్లు, రెండో రోజు 29 కోట్లు, మూబో రోజు 34 కోట్లు, నాలుగో రోజు 35 కోట్లు రూపాయలు వసూలు చేసింది. గత నాలుగు రోజుల్లో ఈ సినిమా 145 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 100 కోట్లుగా జరిగింది. ఈ సినిమా 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది.

Leo Day 5 expected Collections worldwide: Vijay Movie surpasses Rajinikanth Jailer Records

తెలుగులో వసూళ్లు
లియో చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వసూళ్లను రాబడుతున్నది. ఈ సినిమా తొలి రోజు 13 కోట్ల రూపాయలు, రెండో రోజు 4.5 కోట్ల రూపాయలు, మూడో రోజు 4.4 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 3.88 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా గత నాలుగు రోజుల్లో సుమారుగా 25 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా హక్కులను 16 కోట్లకు కొనుగోలు చేశారు. ఇప్పటికే ఈ సినిమా లాభాల్లోకి ప్రవేశించింది.

Leo Day 5 expected Collections worldwide: Vijay Movie surpasses Rajinikanth Jailer Records

కర్ణాటకలో కలెక్షన్లు
ఇక కర్ణాటకలో లియో చిత్రం భారీగానే ప్రభావం చూపలేకపోయింది. తొలి రోజు నుంచి కలెక్షన్లను భారీగా రాబట్టింది. ఈ సినిమా ఇప్పటి వరకు 26 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 15 కోట్ల మేర జరిగింది. ఈ సినిమా దాదాపు కన్నడలో కూడా బ్రేక్ ఈవెన్ సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

హిందీలో పేలవంగా కలెక్షన్లు
లియో చిత్రానికి హిందీ మార్కెట్‌లో భారీ దెబ్బ తగిలింది. కలెక్షన్లను రాబట్టడానికి ఈ సినిమా తంటాలు పడుతున్నది. ఈ సినిమా హిందీ రైట్స్‌ను 10 కోట్ల మేర అమ్మారు. తొలి రోజు 2.8 కోట్లు, రెండో రోజు 1.6 కోట్లు, మూడో రోజు 2.35 కోట్లు, నాలుగో రోజు 2.66 కోట్లు అయితే గత నాలుగు రోజుల్లో ఈ సినిమా కేవలం 11.5 కోట్ల గ్రాస్ వసూళ్లను, సుమారు 8 కోట్ల నికర వసూళ్లను మాత్రమే రాబట్టింది. హిందీ వెర్షన్ మాత్రం డిజాస్టర్ దిశగా కొనసాగుతున్నది.

ఓవర్సీస్‌లో కలెక్షన్లు
లియో చిత్రం ఓవర్సీస్ మార్కెట్‌లో కలెక్షన్ల సునామీని మించి వసూళ్లను సాధిస్తున్నది. ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులను సుమారుగా 60 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేశారు. ఇప్పటికీ ఈ సినిమా మొత్తంగా 150 కోట్ల మేర వసూళ్లను సాధించింది. నార్త్ అమెరికాలోనే ఈ సినిమా 4 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా గత నాలుగు రోజుల్లో మొత్తంగా 402 కోట్ల రూపాయలు బాక్సాఫీస్ వద్ద నమోదు చేసింది.

Leo Day 5 expected Collections worldwide: Vijay Movie surpasses Rajinikanth Jailer Records

లియో మూవీ 5వ రోజు కలెక్షన్లు
ఇక లియో సినిమా 5వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద తడాఖా చూపిస్తున్నది. ఈ సినిమా ఇండియాలో 5వ వరోజు 25 కోట్లకుపైగా వసూళ్లను సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఓవర్సీస్‌లో ఈ సినిమా వసూలు చేసే కలెక్షన్లను కలిపితే మొత్తంగా 30కోట్లకుపైగా రాబట్టవచ్చని అంచనా వేస్తున్నారు.

జవాన్, జైలర్ రికార్డులపై గురి
అయితే లియో చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డులు క్రియేట్ చేస్తున్నది. ఈ సినిమా జైలర్, జవాన్ సినిమాకు ధీటుగా వసూళ్లను సాధిస్తున్నది. ఈ సినిమా జైలర్ రికార్డులను బ్రేక్ చేయగా.. జవాన్‌తో పోటీ పడుతూ కలెక్షన్లను సాధిస్తున్నది. జైలర్ సుమారుగా 300 కోట్ల మేర వసూళ్లను సాధిస్తే.. ఈ చిత్రం 400 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించింది. జవాన్ చిత్రం 500 కోట్లకుపైగా 4 రోజుల్లో సాధిస్తే.. ఈ సినిమా 400 కోట్లు రాబట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X