Leo day 6 Collections విక్రమ్ బాక్సాఫీస్ రికార్డు ఫట్.. లియో కలెక్షన్ల అరాచకం.. 6వ రోజు ఎన్ని కోట్లంటే?

ప్రపంచ బాక్సాఫీస్‌పై హీరో విజయ్, దర్శకుడు లోకేష్ కనకరాజ్ దండయాత్ర కొనసాగుతున్నది. విడుదలైన ప్రతీ చోట, ప్రతీ భాషలో లియో చిత్రం రికార్డు స్థాయి కలెక్షన్లను కొనసాగిస్తున్నది. టాక్, రివ్యూలతో సంబంధం లేకుండా వసూళ్లను సాధిస్తున్నది. సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, త్రిషా కృష్టన్ నటించిన ఈ సినిమా టాప్ కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. లియో సినిమా 6వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

లియో చిత్రం భారీగా అంటే 300 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 220 కోట్ల రూపాయలుగా నమోదు అయింది. అత్యథికంగా 100 కోట్ల మేర బిజినెస్ చేసింది. మిగితా భాషల బిజినెస్ అంతా కలిపి 220 కోట్లకుపైగా ప్రీ రిలీజ్ బిజినేస్ కావడంతో భారీ బ్రేక్ ఈవెన్ లక్ష్యాన్ని సినిమా ముందు ఉంచింది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 5600 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

Leo Day 6 expected Collections worldwide: Vijay Movie crosses Kamal Haasan Vikram

లియో కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ మూవీ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 145 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలో 80 కోట్ల రూపాయలు రాబట్టింది. ఓవర్సీస్‌లో 66 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండో రోజు ఈ సినిమా 65 కోట్ల రూపాయలు, మూడో రోజు 75 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 70 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఐదో రోజు ఈ సినిమా 46 కోట్ల రూపాయాలు వసూలు చేసింది.

దాంతో లియో సినిమా 5 రోజుల్లోనే 400 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరింది. ఇండియాలో 245 కోట్ల రూపాయలు రాబట్టింది. తమిళనాడులో 125 కోట్లు, ఆంధ్రా, నైజాంలో 34 కోట్ల రూపాయలు, కేరళలో 30 కోట్ల రూపాయలు, కేరళలో 40 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 30 కోట్ల రూపాయలు రాబట్టింది. ఓవర్సీస్‌లో 160 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా 400 కోట్ల రూపాయలు సునాయసంగా కలెక్ట్ చేసింది.

Leo Day 6 expected Collections worldwide: Vijay Movie crosses Kamal Haasan Vikram

లియో సినిమా 6వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. మంగళవారం హాలీడే కావడంతో ఈ సినిమాకు మళ్లీ కలిసి వచ్చింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల రూపాయలు కలెక్షన్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా 450 కోట్ల రూపాయలు బాక్సాఫీస్ వద్ద నమోదు చేసింది.

లియో సినిమా తమిళనాడులోనే కాకుండా హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు నమోదు చేస్తున్నది. తమిళనాడులో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. రజనీకాంత్ నటించిన జైలర్ సినిమాతో పోటీ పడుతున్నది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పఠాన్, జైలర్, జవాన్, గదర్ 2 కలెక్షన్ల తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన 5వ చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా రికార్డులను అధిగమించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X