Leo 13 day Collections 600 కోట్ల క్లబ్‌పై కన్నేసిన విజయ్.. లియో మూవీకి ఎన్ని కోట్ల లాభమంటే?
తమిళ చిత్రం లియో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రవాహాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఇళయదళపతి విజయ్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ కలెక్షన్లను నమోదు చేస్తున్నది. సంజయ్ దత్, అర్జున్ సర్జా, త్రిషా, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు నటించిన ఈ సినిమా రెండోవారంలో కూడా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా నిలిచింది. ఈ సినిమా 13వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
లియో సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రావడంతోపాటు అంచనాలకు అనుగుణంగా కలెక్షన్లను సాధించింది. తొలివారంలో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 265 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తమిళంలో 215 కోట్లు, తెలుగులో 35 కోట్లు, హిందీలో 17 కోట్లు వసూలు చేసింది. విజయ్ కెరీర్‌లో ఊహించని కలెక్షన్లను రాబట్టడంతో ట్రేడ్ వర్గాల్లో జోష్ కనిపించింది.

ఇండియాలో లియో సినిమా రెండో వారంలో 9వ రోజు తమిళంలో 6 కోట్లు, తెలుగులో 70 లక్షలు, హిందీలో 1 కోటి రూపాయల వసూలు చేసింది. 10వ రోజు తమిళంలో 12 కోట్ల రూపాయలు, తెలుగులో 1.5 కోట్ల రూపాయలు, హిందీలో 1.6 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక 11వ రోజు తమిళంలో 14 కోట్లు, తెలుగులో 1.5 కోట్లు, హిందీలో 1.65 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 12వ రోజు ఇండియాలో 5 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.
లియో గత 12 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తమిళంలో 245 కోట్లకుపైగా, తెలుగులో 45 కోట్ల రూపాయలకుపైగా, కర్ణాటకలో 40 కోట్ల గ్రాస్, కేరళలో 55 కోట్లకుపైగా గ్రాస్, హిందీలో 23 కోట్ల గ్రాస్, మిగితా రాష్ట్రాల్లో 32 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం 185 కోట్లకుపైగా కలెక్షన్లను నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 545 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

ఇక లియో సినిమా 13వ రోజు బాక్సాఫీస్ రిపోర్టు విషయానికి వస్తే.. ఇండియాలో ఈ చిత్రం 5 కోట్ల మేర నికర వసూళ్లను నమోదు చేసింది. తమిళంలో 3 కోట్లకుపైగా, తెలుగులో 70 లక్షల రూపాయలు, హిందీలో 63 లక్షల రూపాయలు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 7 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ చిత్రం గత 13 రోజుల్లో 552 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లయింది.

లియో సినిమా థియేట్రికల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ విషయానికి వస్తే.. విజయ్ సినిమాకు 420 కోట్ల రూపాయల టార్గెట్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా సుమారుగా 250 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంది. అలాంటి భారీ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించిన ఈ చిత్రం ఇప్పటికే భారీ లాభాలను సాధించింది. ఈ సినిమా 600 కోట్ల రూపాయల వసూళ్ల టార్గెట్‌పై దృష్టి పెట్టింది.


Click it and Unblock the Notifications











