Leo Vs Jailer 600 కోట్ల క్లబ్‌లో లియో.. రజనీ రికార్డును బ్రేక్ చేసిన విజయ్!

తమిళ సినిమా రంగంలో అగ్ర హీరోల సినిమాల కలెక్షన్లు నువ్వా? నేనా అన్నట్టు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఇటీవల రిలీజైన జైలర్, ఆ తర్వాత లియో చిత్రం రికార్డు స్థాయి వసూళ్లను సాధిస్తూ తమిళ సినిమా పరిశ్రమను మరో మెట్టు ఎక్కించే ప్రయత్నం చేశాయి. తాజాగా విజయ్ నటించిన లియో చిత్రం అరుదైన రికార్డును సాధించడమే కాకుండా రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా కలెక్షన్లను అధిగమించడం ఓ రికార్డుగా మారింది. లియో సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ డైరెక్షన్‌లో లియో చిత్రం భారీ హంగులతో రూపుదిద్దుకొన్నది. సంజయ్ దత్, అర్జున్ సర్జా, త్రిషా, గౌతమ్ వాసుదేవ్ మీనన్ లాంటి ఆర్టిస్టుల రెమ్యునరేషన్లతో కలిపి ఈ సినిమా వ్యయం భారీగానే అయింది. ప్రమోషన్స్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను సుమారుగా 300 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు.

Leo Movie 20 days Collections: Vijay Movie beats Rajinikanths Jailer box office numbers

లియో సినిమాకు రిలీజ్‌కు ముందు భారీ క్రేజ్ ఏర్పడటంతో మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సుమారుగా 220 కోట్ల మేర బిజినెస్ చేసింది. 225 కోట్ల షేర్‌తో బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ ప్రారంభించిన ఈ సినిమాను వరల్డ్ వైడ్‌గా 6000 థియేటర్లలో రిలీజ్ చేశారు. రిలీజ్ రోజుకు ముందే ఈ సినిమా రికార్డు అడ్వాన్స్ బుకింగ్‌తో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది.

లియో సినిమా తొలివారం కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో ఈ మూవీ భారీ వసూళ్లను నమోదు చేసింది. తమిళంలో ఈ సినిమా 215 కోట్ల రూపాయలు, తెలుగులో 35 కోట్ల రూపాయలు, హిందీలో 17 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా మొదటి 7 రోజుల్లో 265 కోట్ల రూపాయలు కలెక్షన్లను వసూలు చేసింది.

Leo Movie 20 days Collections: Vijay Movie beats Rajinikanths Jailer box office numbers

ఇక 2వ వారంలో లియో కలెక్షన్లు నిలకడగా నమోదయ్యాయి. తమిళంలో భారీగా వసూళ్లు నమోదు చేస్తూ రెండో వారంలో 40 కోట్లకుపైగా షేర్ వసూలు చేసింది. తెలుగులో 6 కోట్ల రూపాయలు, హిందీలో 7 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో విజయ్ సినిమా మొత్తంగా 54 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లను నమోదు చేసింది.

లియో మూవీ 3వ వారంలో కూడా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా కనిపించింది. 16వ రోజు ఇండియాలో 2.25 కోట్ల రూపాయలు, 17వ రోజు 4.2 కోట్లు, 18వ రోజు 4.8 కోట్లు, 19వ రోజు 1.7 కోట్ల రూపాయలు, 20వ రోజు 1.7 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 3వ వారంలో దాదాపు 17 కోట్ల రూపాయలు వసూలు చేసింది. గత మూడు వారాల్లో ఈ చిత్రం దేశీయంగా 335 కోట్లు వసూలు చేసింది.

లియో సినిమా గత 20వ రోజుల్లో సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో 200 కోట్లకుపైగా గ్రాస్, ఆంధ్ర ప్రదేశ్‌లో 50 కోట్లకుపైగా గ్రాస్, కర్ణాటకలో 40 కోట్లకుపైగా గ్రాస్, హిందీ, ఇతర రాష్ట్రాల్లో 35 కోట్ల రూపాయలు, హిందీ డబ్బింగ్ వెర్షన్ 25 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా ఇండియాలో 400 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో ఈ చిత్రం 190 కోట్లకుపైగా కలెక్షన్లను నమోదు చేయడంతో ఈ సినిమా 600 కోట్ల క్లబ్‌లో చేరింది.

Leo Movie 20 days Collections: Vijay Movie beats Rajinikanths Jailer box office numbers

లియో కలెక్షన్లు భారీగా నమోదు కావడంతో విజయ్ అభిమానులు ఆనందంతో పొంగిపోతున్నారు. జైలర్ కలెక్షన్లను బ్రేక్ చేసిందంటూ ట్వీట్లు చేస్తున్నారు. రజనీకాంత్ జైలర్ సినిమా 25 రోజుల్లో 600 కోట్లు వసూలు చేస్తే.. విజయ్ మూవీ 20 రోజుల్లోనే ఆ మైలురాయిని అధిగమించింది. విజయ్ స్టామినా అంటే ఇదే అంటూ ట్వీట్లు వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X