LEO 25 Days Collections: చరిత్ర సృష్టించిన లియో.. అక్కడే 100 కోట్లు.. తొలి సినిమాగా సంచలన రికార్డు

కోలీవుడ్‌లో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు. కానీ, అందులో అతి తక్కువ మంది మాత్రమే నేషనల్ రేంజ్‌లో క్రేజ్‌ను ఏర్పరచుకున్నారు. వారిలో ఇళయదళపతి విజయ్ ఒకడు. 'మాస్టర్' తర్వాత ఆ స్థాయి హిట్ కోసం చూస్తున్న అతడు.. ఇటీవలే 'లియో' అనే యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీతో ఆడియోన్స్ ముందుకొచ్చాడు.

దీనికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, రెస్పాన్స్ మాత్రం భారీగా వచ్చింది. ఫలితంగా ఈ మూవీకి వసూళ్లు భారీగా లభించాయి. ఈ నేపథ్యంలో 'లియో' మూవీకి 25 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లు మీరే లుక్కేయండి!

LEO Movie 25 Days Collections.. Become First Movie To Reach 100 Crore Share In Tamilnadu

లియోగా విజయ్ ఎంటర్: కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా నటించిన తాజా చిత్రమే 'లియో'. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ యాక్షన్ జోనర్‌లో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని లలిత్ కుమార్, జగదీష్ పళనిస్వామి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇందులో త్రిష హీరోయిన్‌గా చేసింది. అలాగే, సంజయ్ దత్ విలన్‌గా, అర్జున్ సర్జా కీలక పాత్రల్లో కనిపించారు. దీనికి అనిరుధ్ సంగీతాన్ని అందించాడు.

LEO Movie 25 Days Collections.. Become First Movie To Reach 100 Crore Share In Tamilnadu

లియో బిజినెస్ వివరాలివే: విజయ్ - లోకేష్ హిట్ కాంబినేషన్‌లో వచ్చిన 'లియో' మూవీపై నెలకొన్న అంచనాలకు అనుగుణంగా.. ఈ సినిమా హక్కుల కోసం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. ఫలితంగా భారీ ధరలకు ఈ రైట్స్‌ను కొనుగోలు చేశారు. ఇలా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని రికార్డు స్థాయిలో రూ. 215 కోట్లు బిజినెస్‌ చేసుకుంది.

LEO Movie 25 Days Collections.. Become First Movie To Reach 100 Crore Share In Tamilnadu

25వ రోజు తెలుగు కలెక్షన్లు: తమిళ పరిశ్రమకు చెందిన హీరోనే అయినా ఇళయదళపతి విజయ్‌కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఏర్పడింది. అందుకే 'లియో' మూవీని సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ వాళ్లు భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. దీనికి ఫస్ట్ వీక్ మంచి వసూళ్లు వచ్చినా.. మూడో వారం బాగా పడిపోయింది. ఈ క్రమంలోనే 25వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ. 2 లక్షలు షేర్‌ మాత్రమే వసూలు చేసింది.

LEO Movie 25 Days Collections.. Become First Movie To Reach 100 Crore Share In Tamilnadu

25 రోజులకూ కలిపి ఎంత?: 'లియో' మూవీకి 25 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు భారీగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 10.25 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.73 కోట్లు, ఉత్తరాంధ్రాలో రూ. 3.14 కోట్లు, ఈస్ట్‌లో రూ. 2.00 కోట్లు, వెస్ట్‌లో రూ. 1.05 కోట్లు, గుంటూరులో రూ. 1.89 కోట్లు, కృష్ణాలో రూ. 1.66 కోట్లు, నెల్లూరులో రూ. 1.18 కోట్లతో కలిపి రూ. 25.90 కోట్లు షేర్, రూ. 47.30 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

LEO Movie 25 Days Collections.. Become First Movie To Reach 100 Crore Share In Tamilnadu

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?: 25 రోజుల్లో విజయ్ 'లియో' సినిమాకు తమిళనాడులో రూ. 212.45 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 47.30 కోట్లు, కర్నాటకలో రూ. 40.40 కోట్లు, కేరళలో రూ. 59.45 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 36.75 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 194.20 కోట్లు వసూలు అయ్యాయి. ఇలా ఇప్పటికి ఈ మూవీ రూ. 590.55 కోట్లు గ్రాస్, రూ. 297.60 కోట్లు షేర్ రాబట్టి సంచలనం సృష్టించింది.

LEO Movie 25 Days Collections.. Become First Movie To Reach 100 Crore Share In Tamilnadu

టార్గెట్ ఇలా.. లాభం అలా: విజయ్ నటించిన 'లియో' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 215 కోట్లు బిజినెస్ చేయగా.. 25 రోజుల్లో రూ. 297.60 కోట్లు రాబట్టింది. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 81.60 కోట్లు లాభాలను అందుకుంది. తెలుగులో దీనికి రూ. 16 కోట్లు బిజినెస్ జరిగింది. అంటే 17 కోట్ల టార్గెట్‌తో వచ్చిన ఈ మూవీ రూ. 8.90 కోట్లు లాభాలు సొంతం చేసుకుంది.

LEO Movie 25 Days Collections.. Become First Movie To Reach 100 Crore Share In Tamilnadu

ఏకైక సినిమాగా సంచలనం: ఇళయదళపతి విజయ్ నటించిన 'లియో' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా తమిళనాడులో ఈ చిత్రం వారం క్రితమే రూ. 200 కోట్లు గ్రాస్ మార్కును దాటేసి రికార్డు క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ చిత్రం అక్కడ రూ. 100 కోట్లు షేర్ మార్కును చేరింది. తద్వారా ఈ మార్కును దాటిన ఏకైక తమిళ చిత్రంగా రికార్డు సాధించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X