Leo 9 days Collections బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డ లియో.. విజయ్ కలెక్షన్ల మ్యాజిక్‌కు చెక్!
తమిళ సినిమా పరిశ్రమలో అత్యంత భారీ అంచనాలతో వచ్చిన లియో చిత్రం ఊహించినట్టే రికార్డు కలెక్షన్లు నమోదు చేసింది. విజయ్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రానికి అభిమానులు అన్ని భాషల్లో ఆదరించారనేది కలెక్షన్లు రుజువు చేశాయి. సంజయ్ దత్, అర్జున్ సర్జా, త్రిషా కృష్ణన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మడొన్నా సెబాస్టియన్ తదితరులు నటించిన ఈ చిత్రం తొలివారం రికార్డు వసూళ్లు సాధించింది. రెండోవారంలో ఈ సినిమా పరిస్థితి ఎలా ఉందనే విషయానికి వస్తే..
ఇండియాలో లియో చిత్రం తొలివారంలో భారీ కలెక్షన్లు రాబట్టింది. తమిళంలో 215 కోట్ల రూపాయలు నికరంగా, తెలుగులో 35 కోట్ల రూపాయలు, హిందీలో 17 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 33 కోట్లు, కేరళలో 50 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తొలివారంలో ఈ చిత్రం సుమారుగా 270 కోట్ల రూపాయలు నికర వసూళ్లను రాబట్టింది.

తొలివారం భారీ వసూళ్ల తర్వాత లియో చిత్రం 8వ రోజు 9 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా రెండో శుక్రవారం అంటే 9వ రోజున ఈ సినిమా 7.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 9వ రోజున తమిళంలో 5.5 కోట్లు, తెలుగులో 1 కోటి రూపాయలు, హిందీలో 1 కోటి రూపాయల వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో 320 కోట్ల గ్రాస్ వసూళ్లను వసూలు చేసింది.
లియో చిత్రానికి ఓవర్సీస్‌లో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. విజయ్ మార్కెట్‌ను మించి ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. దాదాపు 34 దేశాల్లో రిలీజైన ఈ చిత్రం హాలీవుడ్ సినిమాలను మించి కలెక్షన్లను వసూలు చేసింది. గత 9 రోజుల్లో ఈ సినిమా 175 కోట్ల రూపాయల వసూళ్లను నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 520 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

లియో చిత్రం 300 కోట్ల రూపాయలతో నిర్మించగా.. రిలీజ్‌కు ముందే థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ రూపంలో రికార్డు లాభాలను సాధించింది. థియేట్రికల్‌గా 420 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీ ప్రారంభించిన ఈ సినిమా భారీ లాభాలతో దూసుకెళ్తున్నది. ఇంకా కొద్ది రోజులపాటు కలెక్షన్లను సాధించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











