LEO Box office Collections హాలీవుడ్‌లో చరిత్ర సృష్టించిన లియో.. డికాప్రియో మూవీ మించి రికార్డు కలెక్షన్లు

యువ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, స్టార్ హీరో విజయ్ కాంబినేషన్‌లో నటించిన లియో చిత్రం దేశీయంగానే కాకుండా హాలీవుడ్‌లో కూడా భారీ కలెక్షన్లు సాధిస్తున్నది. ఈ సినిమా హాలీవుడ్ స్టార్ హీరో లియో డికాప్రియో సినిమాపై వసూళ్ల పరంగా అధిక్యం ప్రదర్శిస్తున్నది. ప్రముఖ రేటింగ్ సంస్థ కామ్‌స్కోర్ ఈ సినిమాకు సంబంధించిన హాలీవుడ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

లియో చిత్రం విషయానికి వస్తే.. ఈ సినిమా హిస్టరీ ఆఫ్ వాయెలెన్స్ అనే హాలీవుడ్ మూవీ ఆధారంగా రూపొందింది. ఆ సినిమాలోని మూల కథను తీసుకొని భారతీయ ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా మార్పులు చేర్పులు చేశారు. అయితే ఈ సినిమాపై పూర్తిగా డివైడ్ టాక్ ఉన్నప్పటికీ.. కలెక్షన్ల ప్రవాహానికి అడ్డుకట్ట వేయలేదనేది వసూళ్ల రికార్డులతో స్పష్టమైంది.

Leo movie beats Leonardo DiCaprio’s Killers of the Flower Moon collections as per Comscore Global Ranking

ఇక లియో చిత్రం 4 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లను సాధించింది. ఈ సినిమా ఐదో రోజు కూడా 35 కోట్లకుపైగా రూపాయలను వసూలు చేసే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా 5 రోజుల్లో 450 కోట్ల రూపాయలు కలెక్షన్లకు చేరువైంది. హాలీవుడ్‌లో కామ్‌స్కోర్ వెల్లడించిన కలెక్షన్ల వివరాల్లోకి షాకింగ్‌గా ఉన్నాయి.

హాలీవుడ్‌లో ప్రస్తుతం కిల్లర్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్, పావ్ పెట్రోల్, ట్రోల్స్ బ్యాండ్ టుగెదర్, ఎక్సారిసిస్ట్: బిలీవర్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. తాజాగా రిలీజైన ఇండియన్ చిత్రం లియో హాలీవుడ్ సినిమాలతో పోటీ పొడుతున్నది. అయితే హాలీవుడ్ సినిమాలకు ధీటుగా హాలీవుడ్ వసూళ్లను సాధిస్తున్నది.

Leo movie beats Leonardo DiCaprio’s Killers of the Flower Moon collections as per Comscore Global Ranking

హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద లియోనార్డో డికాప్రియో నటించిన కిల్లర్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ చిత్రం భారీగా వసూళ్లను సాధిస్తున్నది. అక్టోబర్ 19వ తేదీన రిలీజైన లియో చిత్రం రికార్డు వసూళ్లను సాధిస్తున్నది. డికాప్రియో సినిమా 44000000 డాలర్లు (44 మిలియన్ డాలర్లు అంటే 365 కోట్లు) వసూలు చేస్తే.. లియో చిత్రం 48542000 డాలర్లు (సుమారు 49 మిలియన్ డాలర్లు అంటే 400 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. దాంతో ఈ సినిమాకు హాలీవుడ్‌లో ఉన్న ఆదరణ స్పస్టమైంది.

Leo movie beats Leonardo DiCaprio’s Killers of the Flower Moon collections as per Comscore Global Ranking

లియో చిత్రం తమిళ సినిమా రంగంలో అత్యధిక వసూళ్లు సాధించిన బ్లాక్‌బస్టర్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. తమిళంలో జైలర్, పొన్నియన్ సెల్వన్, విక్రమ్ సినిమాలతో కలెక్షన్ల పరంగా పోటీ పడుతున్నది. ఈ సినిమా రానున్న రోజుల్లో ఈ మూవీ ఏ రేంజ్ కలెక్షన్లను సాధిస్తుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X