LEO Advance Booking రిలీజ్‌కు ముందే లియో కలెక్షన్ల సునామీ.. కోట్లు కురిపిస్తున్న అడ్వాన్స్ బుకింగ్!

తమిళ ఇళయ దళపతి విజయ్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ లియో (Leo). లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)లో మూడో చిత్రంగా రూపొందిన ఈ సినిమాలో త్రిష, సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ వాసుదేవ మీనన్, మిస్కిన్ తదితరులు నటించారు. ప్రముఖ నిర్మాతలు ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళనిస్వామి నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 19వ తేదీన రిలీజ్ కానున్నది. అయితే ఈ సినిమాకు భారీ క్రేజ్ ఉండటంతో నెల రోజుల ముందే ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ వివరాల్లోకి వెళితే..

విజయ్ నటించిన లియో చిత్రం రికార్డు స్థాయిలో అత్యధిక దేశాల్లో రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాను దాదాపు 35 దేశాలకుపైగా ప్రదర్శించబోతున్నారు. యూరప్, నార్త్ అమెరికా, దుబాయ్, ఇండియాలో అత్యధికంగా స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను దాదాపు 12000 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Leo movie day 1 Advance booking Collections worldwide

పాపులర్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన లియో చిత్రానికి భారీ డిమాండ్ కనిపిస్తున్నది. ఈ సినిమా ఇప్పటికే ఓవర్సీస్‌లో 1.5 మిలియన్ డాలర్లు కేవలం అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే వసూలు చేసింది. ఇప్పటి వరకు యూకేతోపాటు మొత్తం ఆరు దేశాల్లో మాత్రమే అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయడం గమనార్హం.

లియో చిత్రానికి యూకేలో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అడ్వాన్స్‌ బుకింగ్‌ ద్వారా టికెట్లు కొనుగోలు చేయడానికి ప్రేక్షకులు పోటేత్తారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన 35K టికెట్లు అమ్మకాలు జరిగాయి. తమిళ వెర్షన్ కోసం 30 వేల టికెట్లు, తెలుగు వెర్షన్ కోసం 4000 టికెట్లు, హిందీ కోసం 135 టికెట్లు అమ్ముడుపోయాయి. ఈ సినిమాను 160 లొకేషన్లలో 432 షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు.

Vijay movie rampage at box office

అమెరికాలో లియో సినిమాకు సూపర్ రెస్సాన్స్ కనిపిస్తున్నది. ఈ సినిమా ఇప్పటికే 1.5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. తమిళ వెర్షన్‌కు సమానంగా తెలుగు వెర్షన్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. తెలుగు వెర్షన్ లియో మూవీ ప్రీమియర్ల ద్వారా 400K కలెక్షన్లను సాధించవచ్చని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఆస్ట్రేలియాలో కూడా లియోకు మంచి ఆదరణ కనిపిస్తున్నది. తమిళం కంటే తెలుగు వెర్షన్‌కు డిమాండ్ ఎక్కువగా కనిపిస్తున్నది. ఈ సినిమాను రికార్డు స్థాయిలో 80 లోకేషన్లలో ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ సినిమా ఇప్పటికే 10 లక్షల రూపాయలను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక ఇండియాలో లియో సినిమాకు అద్బుతంగా రెస్సాన్స్ కనిపిస్తున్నది. తమిళనాడులోని దాదాపు అన్ని థియేటర్లు, స్క్రీన్లలో లియో మూవీని రిలీజ్ చేయనున్నారు. ఇక కేరళలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌కు ఆదరణ లభిస్తున్నది. ఈ సినిమాకు సంబంధించి 400 షోలు కేరళలో ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే 12000 టికెట్లు అమ్ముడుపోయాయి. అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఈ సినిమా 1.5 కోట్లు రాబట్టింది. కర్ణాటక, ఏపీ, తెలంగాణలో కూడా భారీ స్పందన లభిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X