Leo box office Collections 2 రోజుల్లో 200 కోట్లు కొల్లగొట్టిన లియో..జవాన్, జైలర్‌ రికార్డులపై విజయ్ గురి

తమిళ సూపర్ స్టార్ విజయ్, అందాల భామలు త్రిష, మడొన్నా సెబాస్టియన్, ప్రియా ఆనంద్, బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్, సౌత్ ఇండియన్ స్టార్ అర్జున్ సర్జా నటించిన చిత్రం లియో తాజాగా అక్టోబర్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తొలి రోజు మిక్స్‌డ్ టాక్ సంపాదించుకొన్నది. లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ ()‌లో భాగంగా రూపొందిన ఈ సినిమాకు లలిత్ కుమార్ నిర్మించారు. ఈ సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

లియో చిత్రంలో స్టార్ హీరోలు, హీరోయిన్లు నటించడంతో భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందింది. విజయ్ రెమ్యునరేషన్ 120 కోట్ల రూపాయలతోపాటు ఇతర నటీనటులు పారితోషికంతో కలిపి మొత్తం 300 కోట్ల రూపాయాల బడ్జెట్ అయింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. 220 కోట్ల మేర జరిగింది.

Leo Movie day 2 expected Collections Worldwide: Vijay, Sanjay Dutt movie into 200 crores club

లియో థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. తమిళనాడు థియేట్రికల్ హక్కులు 100 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల హక్కులు 16 కోట్ల రూపాయలు, కర్ణాటక 16 కోట్లు, కేరళ 14 కోట్లు, మిగితా రాష్ట్రాల హక్కులు 10 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ 60 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది.

ఇక లియో సినిమాకు భారీ క్రేజ్ లభించడంతో మూవీని ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి థియేటర్లలో రిలీజ్ చేశారు. తమిళనాడులో 1100 స్క్రీన్లు, 850 స్క్రీన్లు, హిందీలో 1500 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 1500 స్క్రీన్లుకుపైగా రిలీజ్ చేశారు. ఈ సినిమాను మొత్తంగా 5600 స్క్రీన్లకుపైగా స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

Leo Movie day 2 expected Collections Worldwide: Vijay, Sanjay Dutt movie into 200 crores club

లియో మిక్స్‌డ్ టాక్‌లోను బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా కనిపించింది. ఈ సినిమా రెండో రోజు తమిళ వెర్షన్ 64 శాతం ఆక్యుపెన్సీ, మ్యాట్నీకి 75 శాతం, ఫస్ట్ షోకు 80 శాతం, సెకండ్ షోకు 80 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది. ఇక తెలుగులో ఈ సినిమా 60 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది. కేరళ, కర్ణాటకలో కూడా భారీగా అంటే.. 60 శాతం ఆక్యుపెన్సీతో రన్ అవుతున్నది.

లియో మూవీ రెండో రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. నిలకడగా వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇండియాలో ఈ చిత్రం 2వ రోజు 35 కోట్ల షేర్.. ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల షేర్ వసూలు చేసే అవకాశం ఉంది అని తెలిపారు. దాంతో ఈ సినిమా ఇండియాలో 100 కోట్ల క్లబ్‌లో ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తున్నది.

Leo Movie day 2 expected Collections Worldwide: Vijay, Sanjay Dutt movie into 200 crores club

లియో సినిమా తొలి రోజు కలెక్షన్లు వివరాల్లోకి వెళితే.. ఇండియాలో ఈ చిత్రం 65 కోట్ల షేర్, 76 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. హిందీ వెర్షన్‌ 3 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 14 కోట్ల రూపాయలు, కేరళలో 12 కోట్ల రూపాయలు, తమిళనాడులో 35 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 16 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 142 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది.

లియో సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకుపైగా కలెక్షన్ల గ్రాస్, 220 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. ఈ రేంజ్ కలెక్షన్లు సాధిస్తే తప్ప లాభాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. కాబట్టి తొలివారంలో ఈ సినిమా థియేట్రికల్‌గా లాభాల్లోకి ప్రవేశించ వచ్చని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X