Leo 3 days Collections విజయ్ కలెక్షన్ల ఊచకోత.. 3వ రోజు లియోకు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే!
తమిళ సూపర్ స్టార్ విజయ్, బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్, సౌత్ స్టార్ హీరో అర్జున్ సర్జా, అందాల హీరోయిన్లు త్రిషా, ప్రియా ఆనంద్, మడొన్నా సెబాస్టియన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు నటించిన చిత్రం లియో. దక్షిణాదిలో పాపులర్ యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రిలీజ్‌కు ముందే రికార్డులు తిరగరాసింది. ఈ సినిమా మూడో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
లియో చిత్రంలో భారీ తారాగణం ఉండటంతో బడ్జెట్ భారీగానే పెట్టారు. ఈ సినిమాను దాదాపు 300 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. తమిళనాడు థియేట్రికల్ హక్కులు 100 కోట్ల రూపాయలకు, తెలుగు స్టేట్స్ రైట్స్ 16 కోట్ల రూపాయలు, కర్ణాటక హక్కులు 16 కోట్లు, కేరళ హక్కులు 14 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల హక్కులు 10 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ హక్కులు 60 కోట్ల రూపాయల మేర జరిగింది. మొత్తంగా 220 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదు అయింది.

లియో చిత్రం అడ్వాన్స్ బుకింగ్ రికార్డు స్థాయిలో జరిగింది. ఈ సినిమా ఇండియాలో తొలి రోజు 80 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. హిందీలో తొలి రోజు 3 కోట్లు రూపాయలు, కర్ణాటకలో 14 కోట్ల రూపాయలు, కేరళలో 12 కోట్ల రూపాయలు, తమిళనాడులో 36 కోట్ల రూపాయలు, నైజాం, ఆంధ్రాలో 12 కోట్ల రూపాయలు, మిగితా రాష్ట్రాల్లో 5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఒక ఓవర్సీస్‌లో 8 మిలియన్లు అంటే సుమారుగా 66 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా 145 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది.
ఇక లియో చిత్రం బాక్సాఫీస్‌పై దండయాత్ర రెండో రోజు కూడా కొనసాగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 65 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా తమిళనాడులో రెండో రోజు 25 కోట్ల రూపాయలు, హిందీలో 1.75 కోట్ల రూపాయలు, ఆంధ్ర ప్రదేశ్‌లో 6 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కేరళలో 6 కోట్లకుపైగా, ఇండియాలో మొత్తంగా 38 కోట్ల రూపాయలు రాబట్టింది.

లియో చిత్రం మిక్స్‌డ్ టాక్‌తో కొన్ని ప్రాంతాల్లో, కొన్ని ప్రాంతాల్లో డిజాస్టర్ టాక్ వినిపించినా కలెక్షన్ల పరంగా ఈ సినిమాకు ఎదురులేకుండా పోయింది. ఈ సినిమా మూడో రోజు కూడా భారీగా వసూళ్లను సాధిస్తున్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా మూడో రోజు 75 కోట్ల వరకు కలెక్ట్ చేయవచ్చని పేర్కొంటున్నారు.
హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా విజయ్ బాక్సాఫీస్ స్టామినాకు లియో సాక్ష్యంగా నిలిచింది. ఈ సినిమా గత మూడు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో 60 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో 18 కోట్ల రూపాయలు, కేరళలో 19 కోట్ల రూపాయలు, హిందీ, ఇతర ప్రాంతాల్లో 12 కోట్లు రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 290 కోట్ల రూపాయలు రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











