LGM Movie Collections షాకింగ్‌గా ధోని మూవీ Let Get Married కలెక్షన్లు.. బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్ల వసూళ్లంటే
క్రికెట్ మైదానంలో ప్రత్యర్థి జట్లను, బౌలర్లను గడగడలాడించిన లెజెండరీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ధోని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తొలి చిత్రం LGM (Let's Get Married) మూవీని రూపొందించారు. లవ్ టుడే ఫేమ్ ఇవానా, జెర్సీ ఫేమ్ హరీష్ శంకర్ జంటగా నదియా కీలక పాత్రలో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా భారీ అంచనాలతో తమిళనాడు వ్యాప్తంగా జూలై 28వ తేదీన రిలీజైంది. ఈ సినిమా టాక్, కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే..
LGM (Let's Get Married) సినిమాకు కథ డిమాండ్ చేయడంతో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. లవ్, ఫ్యామిలీ డ్రామా అంశాలతో రూపొందిన ఈ సినిమాను సుమారు 8 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. తొలుత తమిళంలో 400 స్క్రీన్లలో ఈ సినిమాను రిలీజ్ చేశారు.

LGM (Let's Get Married) మూవీ విషయానికి వస్తే.. తొలి ఆట తర్వాత ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్నది. ఫన్ ఎలిమెంట్స్‌తో రొమాంటిక్, ఫ్యామిలీ డ్రామాగా రూపొందించిన ఈ సినిమాకు ఓ వర్గం నుంచి మంచి రెస్పాన్స్ రాగా, క్రిటిక్స్ ఈ సినిమాపై మిక్స్‌డ్‌గా స్పందించారు.
LGM (Let's Get Married) మూవీ తొలి రోజు పెద్ద భారీ సంఖ్యలో ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పించలేకపోయింది. తమిళనాడులో ఈ సినిమా ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెళితే.. మార్నింగ్ షోకు 20 శాతం, మ్యాట్నీకి 25 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఫస్ట్ షోకు ఈ సినిమా ఆక్యుపెన్సీ 30 శాతం, సెకండ్ షోకు 25 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

LGM (Let's Get Married) మూవీ తొలి రోజు ఓ మోస్తారు వసూళ్లను సాధించే అవకాశం ఉంది. ఈ చిత్రం తమిళనాడు బాక్సాఫీస్ వద్ద 1 కోటి రూపాయల వసూళ్లను రాబట్ట వచ్చని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఈ సినిమా 45 లక్షల వసూళ్లను సాధించింది. ఓవర్సీస్ కలెక్షన్లను కలిపి ఈ సినిమా 1.25 కోట్లు రాబట్టే అవకాశం ఉంది.
LGM (Let's Get Married) మూవీ బ్రేక్ ఈవెన్ వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మీడియం రేంజ్ టార్గెట్‌ను ఎదుర్కొంటున్నది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ అందుకోవాలంటే 12 కోట్ల కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది. యావరేజ్ హిట్ కావాలంటే.. 8 కోట్లు వసూళ్లను నమోదు చేయాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications











