For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుడిగాడు, షిరిడిసాయిని బీట్ చేసిన‘లై.ఈ.బ్యూ’

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన తాజా యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'. ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ యూఎస్ బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లే రాబడుతోంది. ఇప్పటికే విడుదలై మంచి కలెక్షన్లు రాబట్టిన సుడిగాడు, షిరిడి సాయి చిత్రాలను తాజాగా 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' బీట్ చేసింది.

    అమెరికా తెలుగు సినిమా బాక్సాఫీస్ రిపోర్ట్ ప్రకారం....సుడిగాడు చిత్రం విడుదల నాటి నుంచి ఇప్పటి వరకు రూ. 1.20 కోట్లు ($220,761) వసూలు చేయగా....నాగార్జున-రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన 11 రోజుల్లో రూ. 1.12 కోట్లు(($206,418) వసూలు చేసింది.

    అయితే తాజాగా విడుదలైన శేఖర్ కమ్ముల 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' చిత్రం గురువారం(సెప్టెంబర్ 13)న విడుదలై తొలి రోజు రూ. 28.61 లక్షలు ($53,148) రాబట్టింది. ఈ మొత్తం ఇటీవల విడుదలైన రికార్డులు సృష్టించిన 'ఈగ' మూవీ తొలిరోజు కలెక్షన్ కంటే ఎక్కువ.

    ఇక శుక్రవారం 'లై.ఈ.బ్యూ' చిత్ర బిజినెస్ డబుల్ అయింది. రెండో రోజు(సెప్టెంబర్ 14) ఈ చిత్రం రూ. 53,16 లక్షలు ($98,842) వసూలు చేసింది. శనివారం (సెప్టెంబర్ 15) కలెక్షన్ల వివరాలు పరిశీలిస్తే రూ. 68,86 లక్షలు($127,926)గా ఉంది. ఇలా తొలి మూడు రోజుల్లో శేఖర్ కమ్ముల చిత్రం రూ. 1.52 కోట్లు ($279,916) వసూలు చేసింది. సుడిగాడు, షిరిడి సాయి చిత్రాలు విడుదలైన నాటి నుంచి ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లను శేఖర్ కమ్ముల చిత్రం కేవలం 3 రోజుల్లో మించి పోవడం గమనార్హం.

    ఈ చిత్రం ద్వారా అక్కినేని అమల సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వగా, హీరోయిన్ శ్రియ సెక్సీ లుక్‌తో ఇందులో కనిపించింది. అదే విధంగా చాలా కాలంగా తెరమరుగైన హీరోయిన్ అంజలా జవేరి ఈచిత్రంలో గెస్ట్ పాత్రలో గ్లామర్ ఒలికించింది.ఈ చిత్రానికి సంగీతం: మిక్కీజె మేయర్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, కెమెరా: విజయ్ సి.కుమార్, ఆర్ట్: తోట తరణి, నిర్మాతలు: శేఖర్ కమ్ముల, చంద్రశేఖర్ కమ్ముల, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శేఖర్ కమ్ముల.

    English summary
    Filmmaker Sekhar Kammula's latest Telugu movie Life is Beautiful (LIB) featuring Shriya Saran and Amala Akkineni in leads, has opened to an overwhelming response at the USA Box Office. The romantic film has beaten the collection of Allari Naresh's Sudigadu and Akkineni Nagarjuna's Shirdi Sai in the country in just three days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X