Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సుడిగాడు, షిరిడిసాయిని బీట్ చేసిన‘లై.ఈ.బ్యూ’
అమెరికా తెలుగు సినిమా బాక్సాఫీస్ రిపోర్ట్ ప్రకారం....సుడిగాడు చిత్రం విడుదల నాటి నుంచి ఇప్పటి వరకు రూ. 1.20 కోట్లు ($220,761) వసూలు చేయగా....నాగార్జున-రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన 11 రోజుల్లో రూ. 1.12 కోట్లు(($206,418) వసూలు చేసింది.
అయితే తాజాగా విడుదలైన శేఖర్ కమ్ముల 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' చిత్రం గురువారం(సెప్టెంబర్ 13)న విడుదలై తొలి రోజు రూ. 28.61 లక్షలు ($53,148) రాబట్టింది. ఈ మొత్తం ఇటీవల విడుదలైన రికార్డులు సృష్టించిన 'ఈగ' మూవీ తొలిరోజు కలెక్షన్ కంటే ఎక్కువ.
ఇక శుక్రవారం 'లై.ఈ.బ్యూ' చిత్ర బిజినెస్ డబుల్ అయింది. రెండో రోజు(సెప్టెంబర్ 14) ఈ చిత్రం రూ. 53,16 లక్షలు ($98,842) వసూలు చేసింది. శనివారం (సెప్టెంబర్ 15) కలెక్షన్ల వివరాలు పరిశీలిస్తే రూ. 68,86 లక్షలు($127,926)గా ఉంది. ఇలా తొలి మూడు రోజుల్లో శేఖర్ కమ్ముల చిత్రం రూ. 1.52 కోట్లు ($279,916) వసూలు చేసింది. సుడిగాడు, షిరిడి సాయి చిత్రాలు విడుదలైన నాటి నుంచి ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లను శేఖర్ కమ్ముల చిత్రం కేవలం 3 రోజుల్లో మించి పోవడం గమనార్హం.
ఈ చిత్రం ద్వారా అక్కినేని అమల సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వగా, హీరోయిన్ శ్రియ సెక్సీ లుక్‌తో ఇందులో కనిపించింది. అదే విధంగా చాలా కాలంగా తెరమరుగైన హీరోయిన్ అంజలా జవేరి ఈచిత్రంలో గెస్ట్ పాత్రలో గ్లామర్ ఒలికించింది.ఈ చిత్రానికి సంగీతం: మిక్కీజె మేయర్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, కెమెరా: విజయ్ సి.కుమార్, ఆర్ట్: తోట తరణి, నిర్మాతలు: శేఖర్ కమ్ముల, చంద్రశేఖర్ కమ్ముల, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శేఖర్ కమ్ముల.