వీకెండ్ లో ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’పరిస్ధితి ? (ట్రేడ్‌టాక్)
హ్యాపీడేస్ కు నకలుగా వచ్చిన ఈ చిత్రం అంతా కొత్త వాళ్లతో శేఖర్ కమ్ముల నిర్మించారు. అయితే అమల,శ్రియ,అంజలా జవేరి వంటి సీనియర్స్ ఉండటం ఈ సినిమాకు ఉన్నంతలో ప్లస్ అయ్యింది. సినిమాకు లెంగ్త్ ఎక్కువైందని,క్లైమాక్స్ మినహా సెకండాఫ్ చాలా డల్ గా ఉందని టాక్ వచ్చింది. దాంతో ఈ సినిమాని అరగంటదాకా ట్రిమ్ చేస్తారని చెప్తున్నారు. అయితే ఇప్పటివరకూ అది జరగలేదు.
అయితే ఈ సినిమాకు పెద్ద సినిమాలు ఏమీ పోటీ లేకపోవటం కలిసివచ్చే అంశం. అంతుకు ముందు విడుదలైన సుడిగాడు, శ్రీమన్నారాయణ, ఓకెఓకె అలా అలా అర కొర కలెక్షన్లతో సాగుతున్నాయి. శిరిడి సాయి సినిమా తొలివారం వసూళ్లు సంతృప్తికరంగానే వున్నా రెండో వారానికి చాలా చోట్ల డ్రాప్ అయ్యాయి. విజయ యాత్రల ప్రభావం పెద్దగా కనపడలేదు. అయితే శేఖర్ కమ్ముల సాదా సీదాగా ప్రారంభించిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమా అన్ని చోట్లా మాంచి ఫ్యాన్సీ రేట్లకు అమ్ముడుపోవటం మాత్రం శేఖర్ కమ్ముల విజయమే అంటున్నారు.


Click it and Unblock the Notifications












