twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వీకెండ్ లో ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’పరిస్ధితి ? (ట్రేడ్‌టాక్)

    By Srikanya
    |

    హైదరాబాద్ : మొన్న శుక్రవారం విడుదలైన శేఖర్ కమ్ముల తాజా చిత్రం 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'. రిలీజ్ కు ముందు ఓ రేంజి బిజినెస్ చేసి హాట్ టాపిక్ గా మారిన ఈ చిత్రం విడుదల రోజే డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయితే వీకెండ్ లో కలెక్షన్స్ పై మాత్రం టాక్ ఎఫెక్టు పడలేదని సమాచారం. ఈ రోజు నుంచి అంటే ఈ సోమవారం నుంచి వచ్చే కలెక్షన్స్ పైనే ఈ చిత్రం పరిస్ధితి ఆధారపడి ఉంటుంది అంటున్నారు.

    హ్యాపీడేస్ కు నకలుగా వచ్చిన ఈ చిత్రం అంతా కొత్త వాళ్లతో శేఖర్ కమ్ముల నిర్మించారు. అయితే అమల,శ్రియ,అంజలా జవేరి వంటి సీనియర్స్ ఉండటం ఈ సినిమాకు ఉన్నంతలో ప్లస్ అయ్యింది. సినిమాకు లెంగ్త్ ఎక్కువైందని,క్లైమాక్స్ మినహా సెకండాఫ్ చాలా డల్ గా ఉందని టాక్ వచ్చింది. దాంతో ఈ సినిమాని అరగంటదాకా ట్రిమ్ చేస్తారని చెప్తున్నారు. అయితే ఇప్పటివరకూ అది జరగలేదు.

    అయితే ఈ సినిమాకు పెద్ద సినిమాలు ఏమీ పోటీ లేకపోవటం కలిసివచ్చే అంశం. అంతుకు ముందు విడుదలైన సుడిగాడు, శ్రీమన్నారాయణ, ఓకెఓకె అలా అలా అర కొర కలెక్షన్లతో సాగుతున్నాయి. శిరిడి సాయి సినిమా తొలివారం వసూళ్లు సంతృప్తికరంగానే వున్నా రెండో వారానికి చాలా చోట్ల డ్రాప్ అయ్యాయి. విజయ యాత్రల ప్రభావం పెద్దగా కనపడలేదు. అయితే శేఖర్ కమ్ముల సాదా సీదాగా ప్రారంభించిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమా అన్ని చోట్లా మాంచి ఫ్యాన్సీ రేట్లకు అమ్ముడుపోవటం మాత్రం శేఖర్ కమ్ముల విజయమే అంటున్నారు.

    English summary
    Director Sekhar Kammula's latest release 'Life is Beautiful' has opened with divide talk. But the film clocked in impressive collections in its opening weekend. LIB has Amala Akkineni, Shriya, Shagun, Sudhakar, Kaushik, etc in the lead roles. Produced on Amigos Creations by Sekhar Kammula the movie has music by Mickey J Meyer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X