Don't Miss!
- News కాంగ్రెస్ వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికి? కుమార్తెతో సహా కడియం శ్రీహరి జంప్‌తో చర్చ!!
- Finance RBI: 2000 నోట్లపై కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ..
- Technology 50MP సెల్ఫీ కెమెరా తో Samsung కొత్త ఫోన్! లాంచ్,ధర వివరాలు
- Sports RCB vs KKR: దాన్ని నైట్ రైడర్స్ బ్రేక్ చేయగలదా?
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్‌లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
షాకిస్తున్న ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ బిజినెస్
వాటి వివరాల్లోకి వెళితే.. నైజాం నుంచి దిల్ రాజు నాలుగు కోట్లకు ఈ చిత్రం రైట్స్ తీసుకున్నాడని,ఓవర్ సీస్ రైట్స్ కోటిన్నరకి ఇచ్చారని, మిగలనవి అన్ని ప్రాంతాలు కలిపి పన్నెండు కోట్లు వరకూ పలికిందని చెప్పుకుంటున్నారు. ఈ చిత్రం అవుట్ రేట్ కు మొదట్లో ఎనిమిది కోట్లుకు చాలా మంది అడిగారని,అయితే శేఖర్ కమ్ముల దాన్ని పట్టించుకోకుండా ట్రైలర్స్ విడుదల అయ్యాకే బిజినెస్ ప్రారంభించి ఈ మొత్తాలని సాధించుకున్నట్లు చెప్తున్నారు.
దగ్గుపాటి రానా తో చేసిన లీడర్ సినిమా ఫెయిలైనా ఈ చిత్రం హ్యాపీడేస్ ప్లేవర్ ని కొనసాగిస్తూండటంతో ఈ చిత్రం ఓపినింగ్స్ బాగుంటాయని భావిస్తున్నారు. ఫ్యామిలీలు,మల్టిప్లెక్స్ లు ఈ సినిమాకు తప్పకుండా వస్తారని భరోసాతో డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. ఓవర్ సీస్ లో అయితే ఖచ్చితంగా ఈ సినిమా మంచి బిజినెస్ చేస్తుందని అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం ప్రమోషన్ ఈ వారం నుంచే భారీ ఎత్తున మొదలెట్టనున్నారు.
ఈ చిత్రం గురించి శేఖర్ కమ్ముల మాట్లాడుతూ... 'హ్యాపీడేస్'తో నాలుగు జంటల కళాశాల జీవితాల్ని చూపించాను. మరి ఇళ్ల దగ్గర అలాంటి అందమైన జీవితం ఉంటే ఎలా ఉంటుందని ఆలోచించినప్పుడు స్ఫురించిన కథే ఇది. కాలనీలోని ఇరుగుపొరుగుతో కష్టసుఖాల్ని పంచుకొనే పెద్దలు.. అంతా కలిసి చేసుకొనే పండగలు, మరోపక్క పిల్లల గోలీలాట, కాగితపు పడవలు, గల్లీ క్రికెట్టు... ఇలాంటివన్నీ రుచి చూస్తే ఎవరి జీవితమైనా అందంగా మారిపోతుందని చెబుతున్నాం. ఆశలు, ఆకాంక్షలు, రొమాన్స్, భావుకత, గందరగోళం, లక్ష్యాలు.. ఇవన్నీ కలగలిసిన చిత్రమిది.