twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాకిస్తున్న ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ బిజినెస్

    By Srikanya
    |

    హైదరాబాద్: శేఖర్ కమ్ముల తాజా చిత్రం 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'. ఈ చిత్రం సెప్టెంబర్ 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఇక ఈ చిత్రం బిజినెస్ ఓ రేంజిలో జరిగిందని సమాచారం. ఎవరూ ఊహించని రేట్లకు ఈ చిత్రం రైట్స్ అమ్ముడుపోయాయని ట్రేడ్ లో వినపడుతోంది. దాదాపు అన్ని ఏరియాలు, ఓవర్ సీస్ కలుపుకుని మొత్తం 18కోట్లకు బిజినెస్ జరిగిందని తెలుస్తోంది.

    వాటి వివరాల్లోకి వెళితే.. నైజాం నుంచి దిల్ రాజు నాలుగు కోట్లకు ఈ చిత్రం రైట్స్ తీసుకున్నాడని,ఓవర్ సీస్ రైట్స్ కోటిన్నరకి ఇచ్చారని, మిగలనవి అన్ని ప్రాంతాలు కలిపి పన్నెండు కోట్లు వరకూ పలికిందని చెప్పుకుంటున్నారు. ఈ చిత్రం అవుట్ రేట్ కు మొదట్లో ఎనిమిది కోట్లుకు చాలా మంది అడిగారని,అయితే శేఖర్ కమ్ముల దాన్ని పట్టించుకోకుండా ట్రైలర్స్ విడుదల అయ్యాకే బిజినెస్ ప్రారంభించి ఈ మొత్తాలని సాధించుకున్నట్లు చెప్తున్నారు.

    దగ్గుపాటి రానా తో చేసిన లీడర్ సినిమా ఫెయిలైనా ఈ చిత్రం హ్యాపీడేస్ ప్లేవర్ ని కొనసాగిస్తూండటంతో ఈ చిత్రం ఓపినింగ్స్ బాగుంటాయని భావిస్తున్నారు. ఫ్యామిలీలు,మల్టిప్లెక్స్ లు ఈ సినిమాకు తప్పకుండా వస్తారని భరోసాతో డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. ఓవర్ సీస్ లో అయితే ఖచ్చితంగా ఈ సినిమా మంచి బిజినెస్ చేస్తుందని అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం ప్రమోషన్ ఈ వారం నుంచే భారీ ఎత్తున మొదలెట్టనున్నారు.

    ఈ చిత్రం గురించి శేఖర్ కమ్ముల మాట్లాడుతూ... 'హ్యాపీడేస్‌'తో నాలుగు జంటల కళాశాల జీవితాల్ని చూపించాను. మరి ఇళ్ల దగ్గర అలాంటి అందమైన జీవితం ఉంటే ఎలా ఉంటుందని ఆలోచించినప్పుడు స్ఫురించిన కథే ఇది. కాలనీలోని ఇరుగుపొరుగుతో కష్టసుఖాల్ని పంచుకొనే పెద్దలు.. అంతా కలిసి చేసుకొనే పండగలు, మరోపక్క పిల్లల గోలీలాట, కాగితపు పడవలు, గల్లీ క్రికెట్టు... ఇలాంటివన్నీ రుచి చూస్తే ఎవరి జీవితమైనా అందంగా మారిపోతుందని చెబుతున్నాం. ఆశలు, ఆకాంక్షలు, రొమాన్స్‌, భావుకత, గందరగోళం, లక్ష్యాలు.. ఇవన్నీ కలగలిసిన చిత్రమిది.

    English summary
    There is a lot of buzz surrounding director Sekhar Kammula's next offering, Life is Beautiful. Abhijeet, Sudhakar, Kaushik, Zara, Rashmi, Kavya, Naveen, Vijay, Sanjeev and Sri Ram star in the main roles in the movie touted to be a youthful entertainer. Mickey J Meyer has composed the music for the film. A coming of age story of six youngsters set in the beautiful nostalgic world of a working-middle class neighborhood. Sekhar Kammula is producing this movie on the Amigos Creations Banner.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X