twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Liger సాలీడ్ అడ్వాన్స్ బుకింగ్స్.. విజయ్ కెరీర్ లోనే న్యూ రికార్డ్!

    |

    రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా ఈనెల 25వ తేదీన భారీ స్థాయిలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరపైకి తీసుకువచ్చిన ఈ సినిమా ఇప్పటికే అభిమానుల్లో అంచనాల స్థాయిని ఒక్కసారిగా పెంచేసింది. సినిమాకు సంబంధించిన ట్రైలర్ తో పాటు సాంగ్స్ కూడా ఓ వర్గం వారిని బాగానే ఆకట్టుకున్నాయి.

    ఇక సినిమాకు ఓపెనింగ్స్ కూడా ఏ స్థాయిలో ఉంటాయి అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. విజయ్ దేవరకొండ కెరీర్ మొత్తంలోనే ఈ సినిమా అత్యధిక థియేటర్లలో విడుదలవుతోంది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా సినిమాకు అన్ని ఏరియా లో నుంచి మంచి డిమాండ్ అయితే ఏర్పడుతున్నట్లు అనిపిస్తోంది.

    Liger movie mind blowing advance bookings in mass centers

    ఇక ఆన్ లైన్ లో ఇటీవల బుకింగ్స్ ఓపెన్ కాగా నిమిషాల్లోనే టికెట్లు చాలా వరకు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ముఖ్యంగా మాస్ ఏరియాలో అయితే విజయ్ దేవరకొండ కెరీర్ లో ఎప్పుడు లేనంత సాలిడ్ బిజినెస్ జరగబోతున్నట్లు సమాచారం. ఓపెనింగ్స్ తోనే విజయ్ దేవరకొండ ఈసారి భారీ స్థాయిలో రికార్డును అందుకోబోతున్నాడు. దాదాపు నైజాం మెయిన్ సెంటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు దర్శనం ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా కూడా లైగర్ సినిమాతో మాత్రం విజయ్ దేవరకొండ అలాగే పూరి జగన్నాధ ఇద్దరు కూడా సరికొత్త రికార్డులు వారి ఖాతాలో వేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

    ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా స్ట్రాంగ్ గానే జరిగింది. దాదాపు 90 కోట్ల టార్గెట్ తో ఈ సినిమా మార్కెట్లోకి అడుగుపెడుతోంది. లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక పవర్ఫుల్ బాక్సర్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇక బాక్సింగ్ గాడ్ మైక్ టైసన్ కూడా ఒక స్పెషల్ క్యారెక్టర్ లో అలరించబోతున్నాడు. మరి సినిమా మొత్తంగా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.

    English summary
    Liger movie mind blowing advance bookings in mass centers
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X