Don't Miss!
- Sports
విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలు నిజమే: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్
- News
అగ్నివీరుల కోసం ఇకపై కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్: పాన్ ఇండియా రిక్రూట్మెంట్స్: ఆర్మీ ప్రకటన
- Finance
adani issue: అదానీ వ్యవహారంపై స్పందించిన కేంద్ర మంత్రి.. హెచ్చుతగ్గులు సాధారణమేనంటూ వ్యాఖ్యలు
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Liger bussiness: ఆచార్యతో బిజినెస్ చేసిన అతని చేతుల్లోకి లైగర్.. ఎంతకు అమ్మారంటే?
గత రెండు మూడేళ్లలో తెలుగు చిత్ర పరిశ్రమ మార్కెట్ ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కరోనా ప్రభావం చూపినప్పటికీ కూడా సినిమాలకు భారీ స్థాయిలో మార్కెట్ అయితే క్రియేట్ అవుతోంది. సినిమాకు ఒక్కసారి పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఊహించని స్థాయిలో కలెక్షన్స్ వస్తున్నాయి. ఇక రాబోయే లైగర్ సినిమా కూడా అలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసే విధంగా ఉన్నట్లు టాక్ అయితే వస్తుంది. ఇక ఈ సినిమాకు డిమాండ్ అయితే మామూలుగా లేదు. రీసెంట్ గా ఆచార్య సినిమా నైజాం హక్కులను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్ లైగర్ తెలుగు హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక తెలుగు రైట్స్ ఎంతకు అమ్ముడయ్యాయి అనే వివరాల్లోకి వెళితే..

పూరి, విజయ్ ఫస్ట్ పాన్ ఇండియా
విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కలయికలో వస్తున్న పాన్ ఇండియా సినిమా లైగర్ పై అంచనాలు అయితే మామూలుగా లేవు. ఎందుకంటే మొదటిసారి పూరి జగన్నాథ్ అలాగే విజయ్ దేవరకొండ ఇద్దరు కూడా ఫ్యాన్ ఇండియా ప్రపంచంలో వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఈ సినిమాతో ఎలాగైనా మంచి సక్సెస్ అందుకోవాలని వీరిద్దరు కూడా చాలా హార్డ్ వర్క్ చేసి ఈ సినిమాను తెరపైకి తీసుకువస్తున్నారు.

బాక్సింగ్ నేపథ్యంలో..
లైగర్ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇదివరకే పూర్తయింది. ప్రస్తుతం చిత్ర యూనిట్ సభ్యులు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇక వీలైనంత త్వరగా సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. ఇదివరకే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కూడా ఒక రేంజ్ లో వైరల్ అయ్యింది. ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

హై వోల్టేజ్ క్యారెక్టర్
లెజెండరీ ఇంటర్నేషనల్ బాక్సింగ్ మైక్ టైసన్ కూడా సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక హై వోల్టేజ్ క్యారెక్టర్ తో అలరించబోతున్నాడు డైలాగ్స్ తో పాటు యాక్షన్ సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయని అనిపిస్తోంది

భారీగా డిమాండ్
ఇక ఈ సినిమాకు మార్కెట్లో అయితే మంచి డిమాండ్ ఏర్పడుతోంది. ఇప్పటికే సినిమా శాటిలైట్ ఓటీటీ రూపంలో దాదాపు 100కోట్లకు పైగానే లాభాలు అందుకున్నట్లు సమాచారం. సినిమా కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా హిందీ తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదల అవుతోంది.

భారీ ధరకు అమ్ముడైన లైగర్
ఇక
ఈ
సినిమాకు
సంబంధించిన
తెలుగు
రిలీజ్
హక్కులను
వరంగల్
శ్రీను
అనే
డిస్ట్రిబ్యూటర్
దక్కించుకున్నట్లు
తెలుస్తోంది.
వరల్డ్
వైడ్
తెలుగు
థియేట్రికల్
హక్కులు
75
కోట్లకు
అమ్ముడైనట్లు
సమాచారం.
ఇదివరకే
ఈ
డిస్ట్రిబ్యూటర్
నైజాం
ఏరియా
ఆచార్య
సినిమా
హక్కులను
కొనుగోలు
చేశాడు.
ఇక
ఇప్పుడు
విజయ్
దేవరకొండ
పాన్
ఇండియా
మూవీని
భారీ
స్థాయిలో
విడుదల
చేసేందుకు
సిద్ధమవుతున్నట్లు
తెలుస్తోంది.
ఇక
లైగర్
సినిమాను
ఈ
ఏడాది
ఆగస్టు
25వ
తేదీన
విడుదల
చేయనున్నారు.