'లయన్' తొలి రోజు కలెక్షన్స్ !! (ఏరియావైజ్)
హైదరాబాద్: బాలకృష్ణ తాజా చిత్రం 'లయన్' నిన్న గురువారం విడుదలైంది. అయితే మార్నింగ్ షోకే చాలా చోట్ల నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. అలాగే కొన్ని ఏరియాల్లో సాయింత్రానికి కానీ షోలు పడలేదు. అయినా సరే బాలయ్య ..భాక్సాఫీస్ వద్ద తన సత్తా చూపాడు. ట్రేడ్ వర్గాల్లో ప్రచారంలో ఉన్న తొలి రోజు కలెక్షన్స్ చూడండి..
నైజాం - 1.49 కోట్లు
పశ్చిమ గోదావరి- 45 లక్షలు
తూర్పు గోదావరి- 44 లక్షలు
ఉత్తరాంధ్ర - 49.12 లక్షలు
నెల్లూరు - 33.19 లక్షలు
కృష్ణా - 44.76 లక్షలు
సీడెడ్ - 1.22 కోట్లు(షోలు లేటు అయ్యాయి).
గుంటూరు - 68 లక్షలు ( 1 గంటకు షోలు పడ్డాయి).
మొత్తం- 5.55 కోట్లు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

కథేమిటంటే....
ముంబైలోని మనోహర్ హాస్పటిల్ లో ...కోమాలో ఉన్న గాడ్సే(బాలకృష్ణ) ఒకరోజు లేచి కూర్చుంటాడు. చాలా కాలం తర్వాత స్పృహలోకి వచ్చిన గాడ్సే...తన పేరు బోస్ అని గాడ్సే కాదని చెప్తూడు. అంతేకాక అక్కడకి వచ్చిన తల్లితండ్రులు(చంద్రమోహన్, జయసుధ)లను, భార్య (రాధికా ఆప్టే)ని గుర్తుపట్టక...వాళ్లు అసలు తన వాళ్ళే కాదని పొమ్మంటాడు. అంతటితో సరిపెట్టక..సరయు(త్రిష) రోడ్డు మీద కనపడితే..ఆమె తన గర్ల్ ఫ్రెండ్ అని వెనకపడతాడు .
ఓ ఇంటికి వెళ్లి అది తన ఇల్లే అంటాడు. అక్కడున్న చలపతిరావు, గీతలను తన తల్లితండ్రులు అంటాడు. ఇంతకీ గాడ్సే ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు. అదేమన్నా హెల్త్ ప్లాబ్లమా..లేక అతను చెప్పేది నిజమేనా... ఇంతకీ ..అతను చెప్పే బోస్ ఎవరు...ముఖ్యమంత్రి (ప్రకాష్ రాజ్) కు గాడ్సేకు వైరం ఏమిటి... బోస్, గాడ్సే వేరు వేరా..ఒకరేనా అనే విషయాలు తెలుసుకోవాలంటే ...సినిమా చూడాల్సిందే.
బాలకృష్ణ సరసన త్రిష హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, జయసుధ, అలీ, గీత, చంద్రమోహన్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: వెంకట్ ప్రసాద్, కూర్పు: గౌతంరాజు


Click it and Unblock the Notifications











