twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇండియా టాప్-10 కలెక్షన్స్, బాహుబలి స్థానం ఎంత?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఏ సినిమా కూడా 100 కోట్ల కలెక్షన్ల మార్కును అందుకోలేదు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి' సినిమా తొలిసారిగా ఆ ఘనత సాధించింది. ఇప్పటి వరకు ఇండియాలో హయ్యెస్ట్ గ్రాసింగ్ కలెక్షన్లు సాధించిన సినిమాల లిస్టులో అమీర్ ఖాన్ నటించిన ‘పికె' రూ. 740 కోట్లు వసూలు చేసి టాప్ పొజిషన్లో ఉంది.

    ‘బాహుబలి' సినిమా విడుదలైన 10 రోజుల్లోనే రూ. 355 కోట్లు వసూలు చేసి టాప్-10 లిస్టులో చోటు దక్కించుకుంది. అయితే సినిమా బిజినెస్ పూర్తయ్యే వరకు ఈ చిత్రం ఏ స్థానంలో నిలుస్తుందో అని ట్రేడ్ విశ్లేషకులు సినిమా వసూళ్లను ఆసక్తిగా గమనిస్తున్నారు.

    ఇండియన్ సినిమాల్లో ఇప్పటి వరకు టాప్ 10 పొజిషన్లో ఉన్న సినిమాల వివరాలు స్లైడ్ షోలో...

    పికె

    పికె

    అమీర్ ఖాన్, అనుష్క శర్మ జంటగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరక్కిన ఈ చిత్రం రూ. 740 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

    ధూమ్ 3

    ధూమ్ 3

    అమీర్ ఖాన్, అభిషేక్ బచ్చన్, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో యష్ రాజ్ ఫిల్మ్స్ తెరకెక్కించిన ధూమ్ 3 చిత్రం రూ. 542 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

    చెన్నై ఎక్స్‌ప్రెస్

    చెన్నై ఎక్స్‌ప్రెస్

    షారుక్ ఖాన్, దీపిక పదుకోన్ జంటగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కించిన రెడ్ చిల్లీస్ ఎంటర్టెన్మెంట్ తెరకెక్కించిన ‘చెన్నై ఎక్స్ ప్రెస్' రూ. 423 కోట్లు వసూలు చేసింది.

    3 ఇడియట్స్

    3 ఇడియట్స్

    అమీర్ ఖాన్, కరీనా కపూర్ ప్రధాన పాత్రల్లో రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో వినోద్ ఛోప్రా ఫిల్మ్స్ తెరకెక్కించిన ‘3 ఇడియట్స్' రూ. 392 కోట్లు వసూలు చేసింది.

    హ్యాపీ న్యూఇయర్

    హ్యాపీ న్యూఇయర్

    షారుక్ ఖాన్-దీపిక పదుకోన్ జంటగా ఫరా ఖాన్ దర్శకత్వంలో రెడ్ చిల్లీస్ ఎంటర్టెన్మెంట్స్ నిర్మించిన ‘హ్యాపీ న్యూఇయర్' రూ. 383 కోట్లు వసూలు చేసింది.

    కిక్

    కిక్

    సాజిద్ నడియావాలా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటించిన ‘కిక్' చిత్రం రూ. 377 కోట్లు వసూలు చేసింది.

    క్రిష్ 3

    క్రిష్ 3

    రాకేష్ రోషన్ దర్శకత్వంలో హృతిక్ రోషన్ నటించిన క్రిష్ 3 చిత్రం రూ. 374 కోట్లు వసూలు చేసింది.

    బాహుబలి-ది బిగినింగ్

    బాహుబలి-ది బిగినింగ్

    రాజమౌళి దర్శకత్వంలో తెరక్కిన ‘బాహుబలి' సినిమా తొలి 10 రోజుల్లో రూ. 355 కోట్లు వసూలు చేసింది. వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

    బ్యాంగ్ బ్యాంగ్

    బ్యాంగ్ బ్యాంగ్

    హృతిక్ రోషన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బ్యాంగ్ బ్యాంగ్' రూ. 340 కోట్లు వసూలు చేసింది.

    ఏక్ థా టైగర్

    ఏక్ థా టైగర్

    సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘ఏక్ థా టైగర్' రూ. 320 కోట్లు వసూలు చేసింది.

    Source: wikipedia

    English summary
    This is a ranking of the highest grossing Indian films which includes film industries from various languages based on the conservative global box office estimates as reported by reputable sources.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X