Little Hearts North America Box Office: యూఎస్‌లో లిటిల్ హార్ట్స్ వసూళ్ల హవా.. ఘాటి, మదరాసి కంటే భారీగా
90s మిడిల్ క్లాస్ బయోపిక్‌తో టీనేజ్ స్టార్‌గా మారిన మౌళీ తనుజ్, అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ మూవీతో పాపులారిటీ సంపాదించుకొన్న శివానీ నాగారం జంటగా నటించిన లవ్ అండ్ రొమాంటిక్ చిత్రం లిటిల్ హార్ట్స్. 90s మిడిల్ క్లాస్ బయోపిక్ దర్శకుడు ఆదిత్య హాసన్ నిర్మాతగా మారి రూపొందించిన చిత్రానికి తొలి చిత్ర దర్శకుడు సాయి మార్తాండ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 5వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? బాక్సాఫీస్ వద్ద రాబడుతున్న కలెక్షన్ల వివరాలు ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
లిటిల్ హార్ట్స్ సినిమాకు సింజిత్ యెర్రమల్లి సంగీతం, సూర్య బాలాజీ సినిమాటోగ్రఫి, శ్రీధర్ సొంపలి ఎడిటర్‌గా, దివ్య పవన్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. యంగ్ టాలెంట్ కూర్పుతో రూపొందిన ఈ సినిమా ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఈటీవీ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్‌పై స్ట్రాంగ్ కంటెంట్‌తో రూపొందింది. ఈ సినిమాను సుమారుగా 2.5 కోట్ల రూపాయలతో నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రికల్‌గా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ సినిమాను ప్రేక్షకుల వద్దకు చేర్చేందుకు ప్రదర్శించిన ప్రీమియర్లకు బ్రహ్మండమైన రెస్పాన్స్ రావడంతో ఓపెనింగ్స్ అదిరిపోతున్నాయి.

శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా చిన్న సినిమాల్లో భారీ కలెక్షన్లను రాబట్టింది. అయితే శనివారం వినాయక నిమజ్జనం వేడుకలు జోరుగా సాగినప్పటికీ.. ఈ చిత్రం బుక్‌మై షో రికార్డు స్థాయిలో టికెట్ల బుకింగ్ జరిగింది. 24 గంటల్లో 120K టికెట్లు అమ్ముడుపోయాయి అని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఆదివారం కూడా భారీగా వసూళ్లను రాబడుతుందని అంచనా వేస్తున్నారు.
లిటిల్ హార్ట్స్ సినిమాను తక్కువ స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి వస్తున్న స్పందన చూసి ప్రముఖ దర్శకులు, అగ్ర నటుల సినిమాలను ధీటుగా స్క్రీన్లు పెంచుతున్నారు. ఇక రానున్న రోజుల్లో ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టడం ఖాయమని తేలిపోయింది. ఈ సినిమాకు నమోదు అవుతున్న ఆక్యుపెన్సీ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది.
టీనేజ్ రొమాన్స్, ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో పేరెంట్స్ బిహేవియర్ లాంటి అంశాలతో రూపొందిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు 1.5 కోట్లు, రెండొ రోజు 3 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం సుమారుగా 4.5 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను అధిగమించింది అని ట్రేడ్ వర్గాలు, చిత్ర యూనిట్ వెల్లడించింది.
ఇక ఓవర్సీస్‌లో ఈ సినిమాను చాలా తక్కువ లొకేషన్లలో రిలీజ్ చేశారు. అయినప్పటికీ.. ఈ సినిమా ఇటీవల రిలీజైన ఘాటీ, మదరాసి, హిందీ చిత్రం బాఘీ 4 సినిమాల కలెక్షన్లను మించి వసూళ్లను నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా 130K డాలర్లు, మదరాసి 127K డాలర్లు, భాఘీ 4 చిత్రం 64K, ఘాటి 16K డాలర్లు వసూలు చేసింది. ఈ చిత్రం స్క్రీన్ల కౌంట్ కూడా పెంచే ప్రయత్నం జరుగుతున్నది. కాబట్టి రానున్న రోజుల్లో ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమెరికాలో ఈ చిత్రం 50 లోకేషన్లలో సుమారుగా 200K కలెక్షన్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











