Little Hearts Day 11 Box Office: లిటిల్ హార్ట్స్‌కు 500% ప్రాఫిట్.. కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?

90s మిడిల్ క్లాస్ బయోపిక్‌ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకుల్లో నటుడిగా గుర్తింపు దక్కించుకున్నాడు మౌలి తనుజ్. ఇక అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ చిత్రంతో ఫేమ్ అయ్యింది హీరోయిన్ శివానీ నాగారం. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే లిటిల్ హార్ట్స్. ఈ చిత్రం సెప్టెంబర్ 5న చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రొమాంటిక్ డ్రామాగా వచ్చి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోంది. మరోవైపు బాక్సాఫీస్ వద్ద కూడా అదిరిపోయే వసూళ్లను అందుకుంటోంది. ఈ సందర్భంగా సినిమా బడ్జెట్? బ్రేక్ ఈవెట్ పాయింట్? 11వ రోజు బాక్సాఫీస్ వసూళ్లు ఎంతనే వివరాల్లోకి వెళితే..

లిటిల్ హార్ట్స్ బడ్జెట్ ఎంత?
ఈ రొమాంటిక్ డ్రామాలో మౌళి తనుజ్, శివానీ నాగారం హీరోహీరోయిన్లుగా, రాజీవ్ కనకాల తండ్రిగా అలరించారు. 90s మిడిల్ క్లాస్ బయోపిక్‌ సిరీస్ ను డైరెక్ట్ చేసిన ఆదిత్య హాసన్ నిర్మాతగా ఈ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించారు. డెబ్యూ డైరెక్టర్ సాయి మార్తాండ్ దర్శకత్వం వహించడం విశేషం. ఈ చిత్రానికి సూర్య బాలాజీ సినిమాటోగ్రఫీని అందించగా, సింజిత్ యెర్రమల్లి అద్భుతమైన సంగీతం అందించారు. దీంతో రెమ్యునరేషన్లు, చిత్ర నిర్మాణ ఖర్చులు, ప్రమోషన్స్ అన్నీ కలుపుకొని రూ.2.5 కోట్ల బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.

Little Hearts Telugu Movie 11 Days Box Office Collections Worldwide

బ్రేక్ ఈవెన్ టార్గెట్?
చిన్న బడ్జెట్ చిత్రం కావడంతో సినిమాకు పెద్దగా ప్రీ రిలీజ్ బిజినెస్ ఏదీ కాలేదు. కానీ సినిమా ప్రీమియర్స్ షోల ద్వారా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. దాంతో భారీ ఎత్తున రిలీజ్ కు టాప్ డిస్టిబ్యూటర్లు బన్నీ వాస్, వంశీ నందిపాటి ముందుకు వచ్చారు. దీంతో థియేట్రికల్ రన్ ద్వారా సినిమాకు రూ.3 కోట్ల షేర్, రూ.6 కోట్ల గ్రాస్ వసూల్ రావాలని ట్రేడ్ నిపుణులు విలువ కట్టారు.

10 రోజుల వసూళ్లు..
ఓపెనింగ్ డే రూ.1.35 కోట్లు, 2.4 కోట్లు, 3వ రోజు రూ.3.6 కోట్లు, 4వ రోజు రూ.2.30 కోట్ల ఇండియా నెట్, 5వ రోజు రూ.2.25 కోట్ల, 6వ రోజు రూ.1.85 కోట్లు, 7వ రోజు రూ.1.5 కోట్లు, 8వ రోజు రూ.1.4 కోట్లు, 9వ రోజు రూ.2 కోట్లు, రూ.10వ రోజు రూ.2 కోట్ల ఇండియా నెట్ వసూల్ చేసింది. దీంతో ఇండియా నెట్ రూ.20.90 కోట్లకు చేరుకుందని సాక్ నిక్ లెక్కలు తెలుపుతున్నాయి.

11వ రోజు..
సోమవారం వర్కింగ్ డే అయినప్పటికీ సెప్టెంబర్ 15న లిటిల్ హార్ట్స్ చిత్రానికి ఓ మాదిరిగానే వసూళ్లు అందాయి. 11వ రోజు రూ.60 లక్షల వరకు ఇండియా నెట్, రూ.1.20 కోట్ల వరకు ఇండియా గ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.

వరల్డ్ వైడ్ కలెక్షన్స్..
2వ వీకెండ్ లో లిటిల్ హార్ట్స్ చిత్రానికి మంచి వసూళ్లు అందాయి. దీంతో ప్రాఫిట్స్ కూడా పెరిగాయి. ఇక 11వ రోజు వరకు ఈ చిత్రం ఇండియా నెట్ రూ.21.50 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.25 కోట్లు, ఓవర్సీస్ లో రూ.8 కోట్లు గ్రాస్ వసూల్ చేసింది. ఇలా వరల్డ్ వైడ్ గా ఇండియా + ఓవర్సీస్ వసూళ్లు కలుపుకొని రూ.33 కోట్ల వరకు వసూల్ అందుకుంది. దీంతో ఈ చిత్రం 30 కోట్ల రూపాయలు అంటే 500% శాతం లాభాన్ని అందుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X