Little Hearts Day 13 Box Office: 2వ వరంలోనూ లిటిల్ హార్ట్స్ జోరు.. 13వ రోజు ఎంత వసూలైందంటే?

చిన్న బడ్జెట్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన లిటిల్ హార్ట్స్ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద స్టడీగా వసూళ్లను అందుకుంటోంది. 2వ వారం పూర్తి కావస్తుండటంతో మరింత ఆసక్తికరంగా కలెక్షన్లు రాబడుతోంది. ఈ చిత్రంలో 90s మిడిల్ క్లాస్ బయోపిక్‌ సిరీస్ ఫేమ్ మౌలి తనుజ్, అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ మూవీ ఫేమ్ శివానీ నాగారం జంటగా నటించారు. డెబ్యూ డైరెక్టర్ సాయి మార్తాండ్ దర్శకత్వం వహించారు. ఈ రొమాంటిక్ డ్రామా సెప్టెంబర్ 5న గ్రాండ్ గా విడుదలైంది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రివ్యూలను అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కూడా జోరుగా వసూళ్లు చేస్తోంది. ఈ క్రమంలో సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ ఎంత? 13వ రోజు బాక్సాఫీస్ కలెక్షన్ ఎంతనే వివరాల్లోకి వెళితే..

లిటిల్ హార్ట్స్ బడ్జెట్? బ్రేక్ ఈవెట్ టార్గెట్?
యంగ్ టాలెంట్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి అతి తక్కువ బడ్జెటే అయ్యింది.మౌలి తనుజ్, శివానీ నాగారం, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషించగా, 90s మిడిల్ క్లాస్ బయోపిక్‌ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ నిర్మాతగా ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై రూ.2.5 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, చిత్ర నిర్మాణ ఖర్చులు, ప్రచార ఖర్చులన్నీ కలుపుకున్న ఈ బడ్జెట్ లోనే పూర్తైందని మేకర్స్ వెల్లడించారు.

Little Hearts Telugu Movie 13 Days Box Office Collections Worldwide

లిటిల్ హార్ట్స్ చిన్న చిత్రమైనా రిలీజ్ ను మాత్రం గ్రాండ్ గా ఉండేలా చూశారు. టాప్ డిస్టిబ్యూటర్లు బన్నీ వాస్, వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. వినూత్నంగా ప్రచారం నిర్వహించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించుకున్నారు. దీంతో ప్రీ రిలీజ్ బిజినెస్ పెద్దగా లేకపోయినా.. ఈ చిత్రం థియేట్రికల్ రన్ ద్వారా రూ.3 కోట్ల షేర్, రూ.6 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయాలని ట్రేడ్ నిపుణులు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను నిర్ణయించారు.

12 రోజుల కలెక్షన్లు..
ఓపెనింగ్ డే రూ.1.35 కోట్లు, 2.4 కోట్లు, 3వ రోజు రూ.3.6 కోట్లు, 4వ రోజు రూ.2.30 కోట్ల ఇండియా నెట్, 5వ రోజు రూ.2.25 కోట్ల, 6వ రోజు రూ.1.85 కోట్లు, 7వ రోజు రూ.1.5 కోట్లు, 8వ రోజు రూ.1.4 కోట్లు, 9వ రోజు రూ.2 కోట్లు, రూ.10వ రోజు రూ.2 కోట్లు, 11వ రోజు రూ.60 లక్షలు, 12వ రోజు రూ.56 లక్షలు ఇండియా నెట్ వసూల్ చేసిందని సాక్ నిక్ గణాంకాలు తెలుపుతున్నాయి.

13వ రోజు..
తొలిరోజు టాక్ పాజిటివ్ గా ఉండటంతో లిటిల్ హార్ట్స్ చిత్రం ఇప్పటికీ థిట్రికల్ రన్ ను కొనసాస్తోంది. బుధవారం సెప్టెంబర్ 18న వర్కింగ్ డే అయినప్పటికీ రూ.50 లక్షల వరకు ఇండియా నెట్, రూ.1కోటీ రూపాయల గ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. దీంతో 13వ రోజు వరకు ఇండియా నెట్ రూ.22.30 కోట్లకు చేరుకుందని వెల్లడించారు.

వరల్డ్ వైడ్ కలెక్షన్స్..
లిటిల్ హార్ట్స్ చిత్రానికి 13వ రోజు వరకు ఇండియా నెట్ రూ.22.30 కోట్లు కాగా, ఇండియా గ్రాస్ రూ.25 కోట్లకు చేరుకుందని, ఓవర్సీస్ నుంచి రూ.9 కోట్ల వరకు కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి. ఇండియా గ్రాస్ + ఓవర్సీస్ కలుపుకొని వరల్డ్ వైడ్ గా రూ.34 కోట్ల గ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ పండితులు తెలుపుతున్నారు. ఈ లెక్కన లిటిల్ హార్ట్స్ చిత్రం రూ.30 కోట్ల లాభాన్ని అందుకోవడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X