Little Hearts Closing Collections: లిటిల్ హార్ట్స్ క్లోజింగ్ కలెక్షన్.. 2 కోట్లు బడ్జెట్ కు ఎన్ని కోట్ల లాభం?

టాలీవుడ్ యంగ్ టాలెంట్స్ కు మంచి గుర్తింపు దక్కుతోంది. యువ దర్శకులు, నటీనటులు, టెక్నీషియన్లు తమ సత్తా ఏంటో చిన్న సినిమాల ద్వారా చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది లిటిల్ హార్ట్స్. ఈ రొమాంటిక్ చిత్రంలో 90s మిడిల్ క్లాస్ బయోపిక్‌ సిరీస్ ఫేమ్ మౌలి తనుజ్, అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ మూవీ ఫేమ్ శివానీ నాగారం జంటగా నటించారు. యంగ్ అండ్ డెబ్యూ డైరెక్టర్ సాయి మార్తాండ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ప్రేక్షకుల స్పందనను పొందడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో లిటిల్ హార్ట్స్ మూవీ బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్? క్లోజింగ్ కలెక్షన్లు ఎన్ని కోట్లు వసూల్ చేసిందనే వివరాల్లోకి వెళితే..

లిటిల్ హార్ట్స్ బడ్జెట్? బ్రేక్ ఈవెన్?
ఈ చిత్రంలో అంతా యంగ్ స్టార్స్ నటించడం, బేసిక్ లోకేషన్లలోనే షూటింగ్ చేయడంతో సినిమాకు తక్కువ బడ్జెటే అయ్యింది. మౌలి తనుజ్, శివానీ నాగారం, రాజీవ్ కనకాల, తదితర యువ నటీనటులు, అలాగే టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, మూవీ ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషన్స్ ను కలుపుకొని రూ.2.5 కోట్ల బడ్జెట్ అయ్యిందని మేకర్స్ వెల్లడించారు. కాగా ఈ చిత్రాన్ని ఈవిన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ లో 90s మిడిల్ క్లాస్ బయోపిక్‌ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించి రూపొందించారు. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ విషయానికొస్తే రూ.3 కోట్ల షేర్, రూ.6 కోట్ల గ్రాస్ వసూల్ చేయాల్సి ఉందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.

Little Hearts Telugu Movie Box Office Closing Collections Worldwide

లిటిల్ హార్ట్స్ క్లోజింగ్ కలెక్షన్స్..
ఓపెనింగ్ డే రూ.1.35 కోట్లు, 2.4 కోట్లు, 3వ రోజు రూ.3.6 కోట్లు, 4వ రోజు రూ.2.30 కోట్ల ఇండియా నెట్, 5వ రోజు రూ.2.25 కోట్ల, 6వ రోజు రూ.1.85 కోట్లు, 7వ రోజు రూ.1.5 కోట్లు, 8వ రోజు రూ.1.4 కోట్లు, 9వ రోజు రూ.2 కోట్లు, రూ.10వ రోజు రూ.2 కోట్లు, 11వ రోజు రూ.60 లక్షలు, 12వ రోజు రూ.56 లక్షలు, 13వ రోజు రూ.47 లక్షలు, 14వ రోజు రూ.45 లక్షల ఇండియా నెట్ వసూల్ చేసింది.

2 వారాల్లో ఈ చిత్రం రూ.22.85 కోట్ల వరకు ఇండియా నెట్ ను వసూల్ చేయడం విశేషం. ఇక 3వ వారంలో 15వ రోజు రూ.45 లక్షలు, 16వ రోజు రూ.80 లక్షలు, 17వ రోజు రూ.90 లక్షలు, 18వ రోజు రూ.23 లక్షలు, 19వ రోజు రూ.25 లక్షలు, 20వ రోజు రూ.10 లక్షలు, 21వ రోజు రూ.2 లక్షలు, 22వ రోజు రూ.7 లక్షలు వసూల్ చేసిందని సాక్ నిక్ గణాంకాలు తెలుపుతున్నాయి. ఇలా 3 వారాలు పూర్తయ్యే సరికి బాక్సాఫీస్ వద్ద ఇండియా నెట్ రూ.26 కోట్లకు చేరుకుంది.

వరల్డ్ వైడ్ గా క్లోజింగ్ కలెక్షన్లు..
ఇండియా నెట్ రూ.26 కోట్లకు చేరుకోగా, ఇండియా గ్రాస్ రూ.29.50 కోట్లుగా నమోదైంది. ఇక ఓవర్సీస్ నుంచి ఈ చిత్రం రూ.9.50 కోట్ల గ్రాస్ ను వసూల్ చేసింది. ఇలా ఇండియా గ్రాస్ + ఓవర్సీస్ వసూళ్లు కలుపుకొని వరల్డ్ వైడ్ గా రూ.39 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం. ఇక లిటిల్ హార్ట్స్ బడ్జెట్ పోను ఈ చిత్రానికి రూ.35 కోట్ల వరకు లాభం వచ్చిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X