Lokah Vs Hridayapoorvam: లోక వర్సెస్ హృదయపూర్వమ్.. మోహన్‌లాల్‌పై కల్యాణి ప్రియదర్శన్ డామినేషన్.. ఎన్ని కోట్ల
మలయాళ సినిమా పరిశ్రమలో ఓనమ్ పండుగ సందర్భంగా విడుదలైన చిత్రాలు కేరళ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నాయి. ఈ పండుగ బరిలో స్టార్ హీరోలు మోహన్‌లాల్, ఫాహద్ ఫాజిల్‌తోపాటు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాతో యువ హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్, మరో లవ్ రొమాంటిక్ చిత్రం మైనే ప్యార్ కియా చిత్రం పోటిపడ్డాయి. అయితే ఈ నాలుగు సినిమాల్లో ముఖ్యంగా మోహన్ లాల్ నటించిన హృదయపూర్వమ్, కల్యాణ్ ప్రియదర్శన్ నటించిన లోక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నువ్వా నేనా అనే విధంగా కలెక్షన్లు రాబడుతున్నాయి. ఈ రెండు సినిమాల గురించిన విషయాల్లోకి వెళితే..
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మాతగా మారి డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం లోక చాప్టర్ 1 చంద్ర. ఈ చిత్రంలో ప్రేమలు హీరో నస్లేన్, కల్యాణి ప్రియదర్శిని జంటగా నటించారు. కూలీ ఫేమ్ షౌబీన్, స్టార్ హీరో టొవినో థామస్, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం, నిమిష్ రవి సినిమాటోగ్రఫి, చమన్ ఛాక్కో సినిమాటోగ్రఫిని అందించారు. ఓనమ్ పండుగ సందర్భంగా ఈ సినిమా 28 ఆగస్టున రిలీజ్ అయింది. ఈ సినిమాలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్, ప్రమోషనల్ కాస్ట్‌తో కలిపి ఈ మూవీని సుమారుగా 65 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. కనీసం 50 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

లోక చాప్టర్ 1: చంద్ర సినిమా కలెక్షన్లు విషయానికి వస్తే.. ఈ సినిమా తొలి రోజు 2.7 కోట్ల రూపాయలు, రెండో రోజు 4 కోట్లు, మూడో రోజు 7.6 కోట్లు, నాలుగో రోజు 10 కోట్లు, ఐదో రోజు 7.2 కోట్ల రూపాయలు రాబట్టింది. మలయాళంలో ఈ చిత్రం 30 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఇక కన్నడలో 4.25 కోట్లు, తెలుగులో 4.5 కోట్లు, తమిళంలో 5 కోట్లు, ఇతర ప్రాంతాల్లో 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలో మొత్తంగా 46 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం 45 కోట్ల రూపాయల రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇదిలా ఉండగా, మోహన్ లాల్, మాళవిక మోహనన్, సంగీతా నాయర్ కీలక పాత్రల్లో నటించిన హృదయపూర్వమ్ సినిమా కూడా సెప్టెంబర్ 28న రిలీజ్ అయింది. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి సత్యన్ అంతికాడ్ దర్వకత్వం వహించారు. డైరెక్టర్ కుమారుడు అఖిల్ సత్యన్ రాసిన కథకు సోను టీపీ స్క్రీన్ ప్లే అందించారు. మీరా జాస్మిన్, బాసిల్ జోసెఫ్ అతిథి పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాను ఆశ్వీరాద్ సినిమాస్ బ్యానర్‌పై అంటోని పెరంబవూర్ సుమారుగా 30 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు.
హృదయపూర్వమ్ సినిమా కేరళ కలెక్షన్ల విషయానికి వస్తే.. తొలి రోజు 3.25 కోట్ల రూపాయలు, రెండో రోజు 2.5 కోట్ల రూపాయలు, మూడో రోజు 3 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 3.7 కోట్ల రూపాయలు, ఐదో రోజు 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ మూవీ గత 5 రోజుల్లో 17 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం 20 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా 37 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.
అయితే కేరళ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పోరులో కల్యాణి ప్రియదర్శన్ నటించిన లోక చిత్రం మోహన్ లాల్ నటించిన హృదయపూర్వమ్ కంటే బెటర్‌గా వసూళ్లను రాబడుతున్నాయి. లోక చిత్రం 100 కోట్లకు చేరువ కాగా, హృదయపూర్వమ్ చిత్రం 50 కోట్లకు చేరువగా వచ్చింది. లోక చిత్రం పలు భాషల్లోరిలీజ్ కాగా, హృదయపూర్వమ్ సినిమా కేవలం మలయాళ భాషలోనే విడుదల కావడం గమనార్హం.


Click it and Unblock the Notifications











