డేటిచ్చారు: గోపీచంద్ సైతం ఈ నెల్లోనే...

By Srikanya

హైదరాబాద్ : గోపీచంద్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ జంటగా నటిస్తున్న చిత్రం 'లౌక్యం'. శ్రీవాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వి.ఆనందప్రసాద్‌ నిర్మాత. ఈ సినిమా సెప్టెంబర్ 26న విడుదల చేయటానికి నిర్ణయించారని సమాచారం. ఈ సినిమాలో గోపీచంద్ పాత్ర హుషారుగా సాగుతూ ఎలాంటి సమస్య అయినా బుద్ధిబలంతో పరిష్కరిస్తుందని అనూప్ సంగీతం అందిస్తున్న పాటల ఆడియో వేడుక సెప్టెంబర్ మొదటివారంలో జరుగుతుందని సమాచారం.

దర్శకుడు మాట్లాడుతూ ''భుజ బలం కంటే బుద్ధి బలాన్ని ఎక్కువగా నమ్ముకున్న యువకుడి కథ ఇది. తన వారికి కష్టం కలిగితే ఆతడు ఏం చేశాడనేది చిత్ర ప్రధానాంశం. గోపీచంద్‌ నటనలో వైవిధ్యం ప్రేక్షకులను నచ్చుతుంది . శ్రీధర్‌ సీపాన నాకు కథ చెప్పినప్పుడు చాలా నవ్వొచ్చింది. ఇంత సరదా కథలుంటాయా అనిపించింది. దర్శకుడిగా ఇదివరకు నేనూ సీరియస్‌ సినిమాలే చేశా. ఇది మాత్రం నన్ను కొత్తదారిలోకి తీసుకెళుతుంది. హంసానందిని కీలకమైన పాటతోపాటు ఓ కీలకమైన పాత్ర కూడా చేసింది'' అన్నారు.

Loukyam to release on September 26

గోపీచంద్‌ మాట్లాడుతూ ''నవ్వించడమే లక్ష్యంగా చేస్తున్న సినిమా ఇది. దర్శకుడు శ్రీవాస్‌, రచయిత శ్రీధర్‌ సీపాన కలిసి నాతో ఓ కొత్త రకమైన పాత్ర చేయిస్తున్నారు. నా ప్రయాణంలో వినోదాత్మక చిత్రాలు చాలా తక్కువ. ఇప్పుడు ఆ తరహాలో మరో చిత్రం తెరకెక్కుతుండడం ఆనందంగా ఉంది. ఇందులోని ప్రతీ సన్నివేశం కడుపుబ్బా నవ్విస్తుంది. నేను, బ్రహ్మానందం, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కలిసి కనిపించే సన్నివేశాలు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి'' అన్నారు.

జయం, నిజం, వర్షం చిత్రాల్లో విలన్‌గా యజ్ఞం, రణం, లక్ష్యం, శంఖం, శౌర్యం, సాహసం, వంటి విజయవంతమైన సినిమాల్లో హీరోగా నటించిన గోపీచంద్ సినిమా పేర్లకు చివర్లో సున్నా ఉంటే హిట్ అనే సెంటిమెంట్‌తో ఈ లౌక్యం టైటిల్ నిర్ణయించారని సమాచారం. చిత్రానికి ఛాయాగ్రహణం: వెట్రి, కూర్పు: శేఖర్‌, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X