LIK Closing Collections: లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ క్లోజింగ్ కలెక్షన్స్.. ప్రదీప్ మూవీకి లాభమెంత? నష్టమెంత?
విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి జంటగా తెరకెక్కిన మూవీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై విక్కీ ఒరిజినల్‌గా రూపొందిన ఈ సినిమాను లలిత్ కుమార్ సమర్పిస్తున్నారు. ఈ సినిమాకు లేడీ సూపర్‌స్టార్ నయనతార నిర్మాతగా, ఎల్‌కే విష్ణు కుమార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎస్‌జే సూర్య, యోగిబాబు, శ్రీమాన్, గౌరీ కిషన్, మాళవిక తదితరులు కీలకపాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, రవి వర్మన్ సినిమాటోగ్రఫిని, ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటర్‌గా, టీ ముతురాజ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరించారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా విడుదలైంది. ఈ నేపథ్యంలో ప్రదీప్ రంగనాథన్ మూవీ బడ్జెడ్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ఎంత? లవ్ ఇన్సూరెన్స్ కంపెనీకి లాభమెంత? నష్టమెంత? అనేది పరిశీలిస్తే..
లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులతో కలిపి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీకి 95 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. ఈ సినిమాకు థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా అదే స్థాయిలో జరిగినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ లాభాల్లోకి రావాలంటే 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. ఈ మూవీని తమిళనాడులో 350 స్క్రీన్లు, తెలుగులో 100 కుపైగా స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 300 స్క్రీన్లు సహా మొత్తంగా వరల్డ్ వైడ్‌గా 900 వరకు స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ కలెక్షన్స్ ఎంత?
ప్రదీప్ రంగనాథన్ మూవీకి ఇండియాలో తొలివారం 33.22 కోట్ల రూపాయలు, రెండో వారం 6.82 కోట్ల రూపాయలు, పదిహేనో రోజున 44 లక్షల రూపాయలు, పదహారో రోజున 57 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇప్పటి వరకు ఇండియాలో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇండియాలో 47.47 కోట్ల రూపాయల నెట్... 58.57 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలైనట్లు సాక్‌నిక్ పేర్కొంది.
లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఓవర్సీస్ కలెక్షన్స్
లవ్ ఇన్సూరెన్స్ కంపెనీకి నార్త్ అమెరికాలో 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే, యూరప్, సింగపూర్, మలేషియా తదితర దేశాలలో ఈ సినిమాకు 8 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఓవర్సీస్‌లో ప్రదీప్ రంగనాథన్ మూవీ 11 కోట్ల రూపాయలు వసూలు చేసింది. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీకి వరల్డ్ వైడ్‌గా 58.57 కోట్ల రూపాయలు వచ్చింది. తమిళనాడులో 32 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 4 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాలలో 10 కోట్ల రూపాయలు, కేరళలలో 77 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 56 లక్షలు రూపాయలు వసూలు చేసింది ఈ చిత్రం.
లవ్ ఇన్సూరెన్స్ కంపెనీకి లాభమెంత? నష్టమెంత?
వరుసగా మూడు సార్లు 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి తిరుగులేని స్థాయికి చేరుకున్న ప్రదీప్ రంగనాథన్ జోరుకు లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ బ్రేక్‌లు వేసింది. దానికి తోడు భారీ బడ్జెట్‌తో రావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. కానీ థియేట్రికల్ రన్‌లో ఈ అంచనాలను ప్రదీప్ రంగనాథన్ అందుకోలేకపోయాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా బడ్జెట్ 95 కోట్ల రూపాయలు కాగా.. ఇప్పటి వరకు కేవలం 58 కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టి కేవలం 60 శాతం మాత్రమే రికవరీ సాధించగలిగింది.
లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ లాభాల్లోకి రావాలంటే 100 కోట్ల రూపాయల షేర్.. 200 కోట్ల రూపాయలు రాబట్టాల్సి ఉంది. అయితే కేవలం 32 కోట్ల రూపాయల షేర్ మాత్రమే రాబట్టి డిస్ట్రిబ్యూషన్ షేర్ పరంగా 70 కోట్ల నష్టాలను మిగిల్చింది. అయితే ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ దాదాపు 30 కోట్ల రూపాయలకు సొంతం చేసుకోవడంతో నిర్మాత బడ్జెట్ పరంగా కొంత సేఫ్ జోన్‌లోకి వచ్చినట్లయ్యింది. అలాగే శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ ద్వారా నిర్మాత స్వల్ప నష్టాలతో బయటపడినట్లుగా ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications