LIK Day 1 Collections: లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ కలెక్షన్స్.. ప్రదీప్ రంగనాథన్‌ మూవీకి తొలిరోజు ఎన్ని కోట్లంటే?

కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్‌కు తమిళనాడుతో పాటు తెలుగులోనూ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. యూత్ ఫుల్, లవ్, రొమాంటిక్ సినిమాలతో యూత్‌లో ఆయన క్రేజ్ దక్కించుకున్నారు. ప్రదీప్ గతంలో నటించిన లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద వరుసగా ఒక్కొక్కటి 100 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టి ఆయనకు హ్యాట్రిక్ విజయాలతో పాటు తిరుగులేని స్టార్‌డమ్‌‌ను ఇచ్చాయి. తాజాగా ప్రదీప్ రంగనాథన్ నటించిన సినిమా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్‌గా విడుదలైంది. ఈ నేపథ్యంలో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? తొలి రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ తారాగణం
లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీలో ప్రదీప్ రంగనాథన్ సరసన యంగ్ హీరోయిన్ కృతిశెట్టి జంటగా నటించింది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై విక్కీ ఒరిజినల్‌గా రూపొందిన ఈ సినిమాను లలిత్ కుమార్ సమర్పిస్తున్నారు. ఈ సినిమాకు లేడీ సూపర్‌స్టార్ నయనతార నిర్మాతగా, ఎల్‌కే విష్ణు కుమార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దర్శకుడు, నటుడు ఎస్‌జే సూర్య కీలక పాత్ర పోషించారు. యోగిబాబు, శ్రీమాన్, గౌరీ కిషన్, మాళవిక తదితరులు కీలకపాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. రవి వర్మన్ సినిమాటోగ్రఫిని, ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటర్‌గా, టీ ముతురాజ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.

Love Insurance Kompany Day 1 Expected Box Office Collections Worldwide Pradeep Ranganathan s film good start at GBOC

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులతో కలిపి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీకి 60 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. టెక్నికల్‌గా అత్యున్నత నిర్మాణ విలువలు, ఫ్యూచర్‌లో కథ జరుగుతున్న అనుభూతిని కలిగించడానికి నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను నిర్మించారు. ప్రదీప్ రంగనాథన్ క్రేజ్‌కు తగినట్లుగానే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీకి థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ బ్రేక్ఈవెన్ టార్గెట్
తమిళనాడు థియేట్రికల్ రైట్స్‌ని రెడ్ జెయింట్ మూవీస్, ఆంధ్రా- నైజాం థియేట్రికల్ రైట్స్‌ని శ్రీ పద్మినీ సినిమాస్, కేరళ థియేట్రికల్ రైట్స్‌ని శ్రీ గోకులం మూవీస్, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్‌ని పార్శ్ ఫిలింస్ , నార్త్ అమెరికా థియేట్రికల్ రైట్స్‌ని ప్రత్యంగిరా సినిమాస్ దక్కించుకున్నాయి. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ లాభాల్లోకి రావాలంటే 62 కోట్ల రూపాయల షేర్.. 125 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది.

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ తొలిరోజు కలెక్షన్స్
టీజర్, ట్రైలర్లతో పాటు హైదరాబాద్, చెన్నై, మధురైలలో నిర్వహించిన ప్రమోషనల్ కార్యక్రమాలు, ప్రదీప్ రంగనాథన్ క్రేజ్ నేపథ్యంలో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ధురంధర్ 2, రాకాస, బైకర్ తదితర చిత్రాలు ఉన్నప్పటికీ ప్రదీప్ మూవీకి మంచి ఆక్యూపెన్సీ నమోదవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రేజ్‌కు తగినట్లుగానే అడ్వాన్స్ బుకింగ్‌లో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీకి టికెట్లు హాట్ కేకుల్లో అమ్ముడయ్యాయి. నార్త్ అమెరికాలో 108 సెంటర్స్‌‌లో 141 షోలకు గాను 980 టికెట్లు అమ్ముడై 15064 డాలర్లు (14 లక్షల రూపాయలు) వసూలు చేసింది.

ఇండియాలోనూ ఈ సినిమాకు మంచి బుకింగ్స్ జరిగాయి. ఏప్రిల్ 8 సాయంత్రం వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం తొలి రోజు లవ్ ఇన్సూరెన్స్ మూవీకి దాదాపు 30K టికెట్లు అడ్వాన్స్ బుకింగ్‌లో అమ్ముడయ్యాయి. తొలిరోజు సాయంత్రం 4 గంటల వరకు ఇండియాలో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీకి 1645 షోలు ప్రదర్శితమై... 27.3 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. తమిళంలో 1086 షోలు, తెలుగులో 559 షోలు ప్రదర్శితమయ్యాయి. ఇప్పటి వరకు ఇండియాలో ప్రదీప్ రంగనాథన్ మూవీకి 1.53 కోట్ల రూపాయల నికర వసూళ్లు వచ్చాయి. తొలిరోజు లవ్ ఇన్సూరెన్స్ కంపెనీకి తమిళంలో 3 కోట్ల రూపాయలు, తెలుగులో కోటి రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 30 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 50 లక్షల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 5 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X