LIK Day 2 Collections: లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ బాక్సాఫీస్ కలెక్షన్లు.. ప్రదీప్ రంగనాథన్‌ మూవీకి ఎన్ని కోట్లంటే?

యువ హీరో, హీరోయిన్లు ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి జంటగా దర్శకుడు, నటుడు ఎస్‌జే సూర్య కీలక పాత్రలో నటించిన చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (LIK - Love Insurance Kompany). ఈ చిత్రానికి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై విక్కీ ఒరిజినల్‌గా రూపొందిన ఈ సినిమాను లలిత్ కుమార్ సమర్పిస్తున్నారు. ఈ సినిమాకు స్టార్ హీరోయిన్ నయనతార నిర్మాతగా, ఎల్‌కే విష్ణు కుమార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో యోగిబాబు, శ్రీమాన్, గౌరీ కిషన్, మాళవిక తదితరులు నటించారు.

ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. రవి వర్మన్ సినిమాటోగ్రఫిని, ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటర్‌గా, టీ ముతురాజ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరించారు. ఈ సినిమా ఏప్రిల్ 10వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమా వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Love Insurance Kompany Day 2 Box Office

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా టెక్నికల్‌గా, క్వాలిటీగా, వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్‌తో రిచ్‌గా రూపొందించారు. ఈ సినిమాకు పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులన్నీ కలిపి ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 65 కోట్ల రూపాయలని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ప్రదీప్ రంగనాథన్ హ్యాట్రిక్ విజయాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో బిజినెస్ కూడా భారీగా వాల్యూ కట్టారు.

ప్రదీప్ రంగనాథన్, విఘ్నేష్ శివన్, నయనతార, అనిరుధ్, కృతిశెట్టి, ఎస్‌జే సూర్య లాంటి టీమ్ వర్క్ చేయడంతో ఈ సినిమాపై క్రేజ్ విపరీతంగా పెరిగింది. దాంతో ఈ సినిమాను తమిళనాడులో 350 స్క్రీన్లు, తెలుగులో 100 కుపైగా స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 300 కుపైగా స్క్రీన్లలో రిలీజ్ చేశారు. కర్ణాటక, ఇతర ప్రాంతాల్లో కలిపి ఈ సినిమాను సుమారుగా 900 వరకు స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ చిత్రం 60 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

LiK మూవీ సినిమా తొలి రోజు గ్రాండ్‌గా కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా తమిళనాడులో ఈ సినిమా తమిళనాడులో 6 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 1.5 కోట్ల రూపాయలు రాబట్టింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 1.5 కోట్ల రూపాయల వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ఇండియాలో 9 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఓవర్సీస్‌లో ఈ సినిమా పాజిటివ్‌గా రెస్పాన్స్ కూడగట్టుకొన్నది. అమెరికా, కెనడాలో 50 వేల డాలర్లు వసూలు చేసింది అంటే.. భారతీయ కరెన్సీలో 2 కోట్ల రూపాయల వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 11 కోట్ల నెట్, 14 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక ఈ సినిమా తాజా సమాచారం అందే సరికి ఈ చిత్రం రెండో రోజు బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా కలెక్షన్లను రాబడుతున్నది. ఈ చిత్రం రెండో రోజు 4 నుంచి 5 కోట్ల మధ్య వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది అని అంచనా వేశారు. ఇదే జోష్ కొనసాగిస్తే.. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టమేమీ కాదనే అభిప్రాయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X