LIK Day 3 Collections: లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ వసూళ్ల జోరు.. ప్రదీప్ రంగనాథన్ మూవీకి ఎన్ని కోట్లంటే?

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి జంటగా నటించిన మూవీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై విక్కీ ఒరిజినల్‌గా రూపొందిన ఈ సినిమాను లలిత్ కుమార్ సమర్పిస్తున్నారు. ఈ సినిమాకు లేడీ సూపర్‌స్టార్ నయనతార నిర్మాతగా, ఎల్‌కే విష్ణు కుమార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దర్శకుడు, నటుడు ఎస్‌జే సూర్య కీలక పాత్ర పోషించారు. యోగిబాబు, శ్రీమాన్, గౌరీ కిషన్, మాళవిక తదితరులు కీలకపాత్రల్లో నటించారు.

అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, రవి వర్మన్ సినిమాటోగ్రఫిని, ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటర్‌గా, టీ ముతురాజ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా విడుదలైంది. ఈ నేపథ్యంలో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? మూడో రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

Love Insurance Kompany Day 3 Expected Box Office Collections Worldwide Pradeep Ranganathan s film maintaining a steady performance

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులతో కలిపి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీకి 65 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. ఈ సినిమాకు థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా అదే స్థాయిలో జరిగినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. తమిళనాడు థియేట్రికల్ రైట్స్‌ని రెడ్ జెయింట్ మూవీస్, ఆంధ్రా- నైజాం థియేట్రికల్ రైట్స్‌ని శ్రీ పద్మినీ సినిమాస్, కేరళ థియేట్రికల్ రైట్స్‌ని శ్రీ గోకులం మూవీస్, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్‌ని పార్శ్ ఫిలింస్ , నార్త్ అమెరికా థియేట్రికల్ రైట్స్‌ని ప్రత్యంగిరా సినిమాస్ దక్కించుకున్నాయి. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ లాభాల్లోకి రావాలంటే 62 కోట్ల రూపాయల షేర్.. 125 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. ఈ మూవీని తమిళనాడులో 350 స్క్రీన్లు, తెలుగులో 100 కుపైగా స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 300 స్క్రీన్లు సహా మొత్తంగా వరల్డ్ వైడ్‌గా 900 వరకు స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ 2 రోజుల వసూళ్లు
లవ్ ఇన్సూరెన్స్ కంపెనీకి తొలిరోజున 7.05 కోట్ల రూపాయలు, రెండో రోజున 7.70 కోట్ల రూపాయలు వసూలైంది. రెండ్రోజుల్లో ఇండియా వైడ్‌గా 14.75 రూపాయలు, 17.08 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. రెండు రోజుల్లో తమిళనాడులో 12.30 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాలలో 3.45 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 1.70 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 50 లక్షల రూపాయలు వసూలు చేసింది.

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఓవర్సీస్ వసూళ్లు
ఇక ఓవర్సీస్‌లోనూ ప్రదీప్ రంగనాథన్ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. శనివారం ఒక్కరోజు నార్త్ అమెరికాలో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీకి 49కే డాలర్లు (దాదాపు 46 లక్షల రూపాయలు) వసూలు చేసింది. ఓవర్సీస్‌లో తొలిరోజున 2 కోట్ల రూపాయలు, శనివారం 3.30 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మొత్తంగా ఇప్పటి వరకు ప్రదీప్ రంగనాథన్ మూవీకి ఓవర్సీస్‌లో 5.30 కోట్ల రూపాయలు రాబట్టింది. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 22.38 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది.

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ 3వ రోజు వసూళ్ల అంచనా
పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో పాటు యూత్ నుంచి మంచి రెస్పాన్స్ కారణంగా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఆదివారం కూడా ఈ మూవీ భారీగా బుకింగ్స్ అందుకుంటోంది. 3వ రోజు లవ్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇండియాలో ఇప్పటి వరకు 2200 షోలు ప్రదర్శితమై.. 30.9 శాతం ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ నివేదించింది. తాజా సమాచారం మేరకు ఈ సినిమాకు ఇండియాలో 3.47 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది. 3వ రోజు ఈ సినిమాల తమిళంలో 5 కోట్ల రూపాయలు, తెలుగులో కోటి రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 50 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 2 కోట్ల రూపాయలు చొప్పున 10 కోట్ల రూపాయల రేంజ్‌లో వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X