LIK Day 4 Collections: ఆ రికార్డ్ కొట్టలేకపోయిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ.. ప్రదీప్ మూవీకి 4వ రోజు ఎంతంటే?

హ్యాట్రిక్ విజయాల హీరో ప్రదీప్ రంగనాథన్.. యంగ్ హీరోయిన్ కృతిశెట్టి జంటగా నటించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్‌లో భారీగా వసూళ్లు సాధించి.. వర్కింగ్ డేస్‌లోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? నాలుగో రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీకికి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించగా.. రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై విక్కీ ఒరిజినల్‌గా రూపొందిన ఈ సినిమాను లలిత్ కుమార్ సమర్పిస్తున్నారు. ఈ సినిమాకు లేడీ సూపర్‌స్టార్ నయనతార నిర్మాతగా, ఎల్‌కే విష్ణు కుమార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎస్‌జే సూర్య, యోగిబాబు, శ్రీమాన్, గౌరీ కిషన్, మాళవిక తదితరులు కీలకపాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, రవి వర్మన్ సినిమాటోగ్రఫిని, ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటర్‌గా, టీ ముతురాజ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా విడుదలైంది.

Love Insurance Kompany Day 4 Expected Box Office Collections Worldwide Pradeep Ranganathan s film maintaining Steady collections

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులతో కలిపి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీకి 65 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. ఈ సినిమాకు థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా అదే స్థాయిలో జరిగినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ లాభాల్లోకి రావాలంటే 62 కోట్ల రూపాయల షేర్.. 125 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. ఈ మూవీని తమిళనాడులో 350 స్క్రీన్లు, తెలుగులో 100 కుపైగా స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 300 స్క్రీన్లు సహా మొత్తంగా వరల్డ్ వైడ్‌గా 900 వరకు స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ 3 రోజుల వసూళ్లు
లవ్ ఇన్సూరెన్స్ కంపెనీకి తొలిరోజున 7.05 కోట్ల రూపాయలు, రెండో రోజున 7.95 కోట్ల రూపాయలు, మూడో రోజు 7.70 కోట్ల రూపాయలు వసూలైంది. రెండ్రోజుల్లో ఇండియా వైడ్‌గా 23.21 రూపాయలు, 26.89 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. మూడు రోజుల వరకు తమిళంలో18.40 కోట్ల రూపాయలు, తెలుగులో 4.3 కోట్ల రూపాయలు, కన్నడంలో 2.20 కోట్ల రూపాయలు, కేరళలో 63 లక్షల రూపాయలు వసూలు చేసింది.

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఓవర్స్ కలెక్షన్స్
నార్త్ అమెరికాలో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీకి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. మూడో రోజు రాత్రి అక్కడ ప్రదీప్ రంగనాథన్ మూవీకి 25కే డాలర్లు (భారత కరెన్సీలో 23.33 లక్షల రూపాయలు) రాబట్టగా.. యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్, మలేషియా సహా మొత్తంగా ఓవర్సీస్ నుంచి మూడు రోజుల వరకు ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా 8.30 కోట్ల రూపాయలు రాబట్టింది. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ వసూళ్లు కలిపి 3 రోజుల వరకు లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీకి వరల్డ్ వైడ్‌గా 35.59 కోట్ల రూపాయలు రాబట్టింది.

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ 4వ రోజు వసూళ్ల అంచనా
వీకెండ్‌లో దుమ్ముదులిపిన ప్రదీప్ రంగనాథన్ మూవీకి సోమవారం నుంచి అగ్నిపరీక్ష ఎదురుకానుంది. వర్కింగ్ డేస్‌కి తోడు, ఐపీఎల్ కారణంగా వసూళ్లపై ప్రభావం పడే అవకాశం ఉంది. అయినప్పటికీ తమిళనాడులో మంచి హోల్డ్ సాధిస్తోంది ఈ మూవీ. సోమవారం మధ్యాహ్నం 2 గంటల వరకు లవ్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇండియాలో 17 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీతో 1557 షోలు ప్రదర్శితమయ్యాయి. తమిళంలో 956 షోలు, తెలుగులో 601 షోలు రన్ అయ్యాయి. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఇండియాలో 4వ రోజు 51 లక్షల రూపాయల నికర వసూళ్లు రాబట్టాడు ప్రదీప్. 4వ రోజు తమిళంలో 2 కోట్ల రూపాయలు, తెలుగులో 50 లక్షల రూపాయలు, కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియాలో 25 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 50 లక్షల రూపాయలు చొప్పున సోమవారం వరల్డ్ వైడ్‌గా 4 కోట్ల రూపాయలు వసూలు చేయొచ్చని అంచనా వేస్తున్నారు.

ఆ రెండు చిత్రాల కంటే వెనుకే
అయితే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ రాబట్టడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రదీప్ గత చిత్రాలు ఇండియాలో ఫస్ట్ వీకెండ్‌లో రాబట్టిన వసూళ్లతో పోలిస్తే.. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ బాగా వెనుకపడింది. డ్యూడ్ మూవీ ఫస్ట్ వీకెండ్‌లో 30.75 కోట్ల రూపాయలు వసూలు చేయగా.. డ్రాగన్ 30.05 కోట్ల రూపాయలు రాబట్టింది. అయితే తాజా చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మాత్రం ఓపెనింగ్ వీకెండ్‌లో కేవలం 22.70 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేయగలిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X