LIK Day 5 Collections: లవ్ ఇన్సూరెన్స్ కంపెనీకి డీసెంట్ కలెక్షన్స్.. ప్రదీప్ మూవీకి ఎన్ని కోట్లంటే?

ప్రదీప్ రంగనాథన్.. కృతిశెట్టి జంటగా తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో వచ్చిన మూవీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై విక్కీ ఒరిజినల్‌గా రూపొందిన ఈ సినిమాను లలిత్ కుమార్ సమర్పిస్తున్నారు. ఈ సినిమాకు లేడీ సూపర్‌స్టార్ నయనతార నిర్మాతగా, ఎల్‌కే విష్ణు కుమార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎస్‌జే సూర్య, యోగిబాబు, శ్రీమాన్, గౌరీ కిషన్, మాళవిక తదితరులు కీలకపాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, రవి వర్మన్ సినిమాటోగ్రఫిని, ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటర్‌గా, టీ ముతురాజ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా విడుదలైంది. ఈ నేపథ్యంలో ప్రదీప్ రంగనాథన్ మూవీ బడ్జెడ్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? 5వ రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
బాడీగార్డ్స్ ముందే నా నడుము గిల్లిన తుంటరి.. వాడికి అలా బుద్ధి చెప్పా... బిగ్‌బాస్ దివి
బాడీగార్డ్స్ ముందే నా నడుము గిల్లిన తుంటరి.. వాడికి అలా బుద్ధి చెప్పా... బిగ్‌బాస్ దివి

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులతో కలిపి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీకి 65 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. ఈ సినిమాకు థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా అదే స్థాయిలో జరిగినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ లాభాల్లోకి రావాలంటే 62 కోట్ల రూపాయల షేర్.. 125 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. ఈ మూవీని తమిళనాడులో 350 స్క్రీన్లు, తెలుగులో 100 కుపైగా స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 300 స్క్రీన్లు సహా మొత్తంగా వరల్డ్ వైడ్‌గా 900 వరకు స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

Love Insurance Kompany Day 5 Expected Box Office Collections Worldwide Pradeep Ranganathan s film inching towards 50 crores mark

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ 4 రోజుల వసూళ్లు
లవ్ ఇన్సూరెన్స్ కంపెనీకి తొలిరోజున 7.05 కోట్ల రూపాయలు, రెండో రోజున 7.95 కోట్ల రూపాయలు, మూడో రోజు 7.50 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 3 కోట్ల రూపాయలు వసూలైంది. 4 రోజుల్లో ఇండియా వైడ్‌గా 26.54 రూపాయలు, 30.73 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. మూడు రోజుల వరకు తమిళంలో20.6 కోట్ల రూపాయలు, తెలుగులో 4.9 కోట్ల రూపాయలు, కన్నడంలో 2.70 కోట్ల రూపాయలు, కేరళలో 68 లక్షల రూపాయలు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజున 92 లక్షల రూపాయలు, రెండో రోజున 90 లక్షల రూపాయలు, మూడో రోజున 81 లక్షల రూపాయలు, నాలుగో రోజున 34 లక్షల రూపాయలు చొప్పున 5.70 కోట్ల రూపాయలు గ్రాస్ రాబట్టింది.

Also Read
బాడీగార్డ్స్ ముందే నా నడుము గిల్లిన తుంటరి.. వాడికి అలా బుద్ధి చెప్పా... బిగ్‌బాస్ దివి
బాడీగార్డ్స్ ముందే నా నడుము గిల్లిన తుంటరి.. వాడికి అలా బుద్ధి చెప్పా... బిగ్‌బాస్ దివి

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఓవర్స్ కలెక్షన్స్
నార్త్ అమెరికాలో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీకి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఆదివారం వరకు ఈ సినిమాకు నార్త్ అమెరికాలో 170కే డాలర్లు (భారత కరెన్సీలో 1.55 కోట్ల రూపాయలు) వసూలైంది. యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్, మలేషియా సహా మొత్తంగా ఓవర్సీస్ నుంచి నాలుగు రోజుల వరకు ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా 9 కోట్ల రూపాయలు రాబట్టింది. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ వసూళ్లు కలిపి 4 రోజుల వరకు లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీకి వరల్డ్ వైడ్‌గా 38.5 కోట్ల రూపాయలు రాబట్టింది.

Recommended For You
పెళ్లయిన యంగ్ హీరోతో పూజా హెగ్డే డేటింగ్? రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన బుట్టబొమ్మ
పెళ్లయిన యంగ్ హీరోతో పూజా హెగ్డే డేటింగ్? రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన బుట్టబొమ్మ

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ 5వ రోజు వసూళ్ల అంచనా
వీకెండ్‌లో సత్తా చాటినదీప్ రంగనాథన్ మూవీ సోమవారం టెస్ట్‌లోనూ పాసైంది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల వరకు లవ్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇండియాలో 20 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీతో 1700 షోలు ప్రదర్శితమైనట్లు సాక్‌నిక్ నివేదించింది. తమిళంలో 1100 షోలు, తెలుగులో 600 షోలు రన్ అయ్యాయి. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఇండియాలో 5వ రోజు 1.04 కోట్ల రూపాయల నికర వసూళ్లు రాబట్టాడు ప్రదీప్. 5వ రోజు తమిళంలో 2 కోట్ల రూపాయలు, తెలుగులో 50 లక్షల రూపాయలు, కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియాలో 25 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 50 లక్షల రూపాయలు చొప్పున సోమవారం వరల్డ్ వైడ్‌గా 4 కోట్ల రూపాయలు వసూలు చేయొచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో కలిపి 5 రోజుల్లో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీకి 43 కోట్ల రూపాయలు వసూలు అవుతుందని అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X