LIK Day 7 Collections: లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ వసూళ్లపై భారీ దెబ్బ.. ప్రదీప్ మూవీకి 7వ రోజు ఎంతంటే?

ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి జంటగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై విక్కీ ఒరిజినల్‌గా రూపొందిన ఈ సినిమాను లలిత్ కుమార్ సమర్పిస్తున్నారు. ఈ సినిమాకు లేడీ సూపర్‌స్టార్ నయనతార నిర్మాతగా, ఎల్‌కే విష్ణు కుమార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎస్‌జే సూర్య, యోగిబాబు, శ్రీమాన్, గౌరీ కిషన్, మాళవిక తదితరులు కీలకపాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, రవి వర్మన్ సినిమాటోగ్రఫిని, ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటర్‌గా, టీ ముతురాజ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా విడుదలైంది. ఈ నేపథ్యంలో ప్రదీప్ రంగనాథన్ మూవీ బడ్జెడ్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? 6వ రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులతో కలిపి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీకి 65 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. ఈ సినిమాకు థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా అదే స్థాయిలో జరిగినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ లాభాల్లోకి రావాలంటే 62 కోట్ల రూపాయల షేర్.. 125 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. ఈ మూవీని తమిళనాడులో 350 స్క్రీన్లు, తెలుగులో 100 కుపైగా స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 300 స్క్రీన్లు సహా మొత్తంగా వరల్డ్ వైడ్‌గా 900 వరకు స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

Love Insurance Kompany Day 7 Expected Box Office Collections Worldwide Pradeep Ranganathan s records big drop

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ 6 రోజుల వసూళ్లు
లవ్ ఇన్సూరెన్స్ కంపెనీకి తొలిరోజున 7.05 కోట్ల రూపాయలు, రెండో రోజున 7.95 కోట్ల రూపాయలు, మూడో రోజు 7.50 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 3 కోట్ల రూపాయలు, ఐదో రోజున 4.15 కోట్ల రూపాయలు, ఆరవ రోజున 1.95 కోట్ల రూపాయలు వసూలైంది. 6 రోజుల్లో ఇండియా వైడ్‌గా 32 కోట్ల రూపాయలు నెట్.. 37 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. 6 రోజుల వరకు తమిళనాడులో 26 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాలలో 8 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఓవర్సీస్ కలెక్షన్స్
మంగళవారం వరకు నార్త్ అమెరికాలో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీకి 245 డాలర్లు (భారత కరెన్సీలో 2.28 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. సింగపూర్, మలేషియా, యూరప్, యూకే తదితర దేశాలలో ప్రదీప్ రంగనాథన్ మూవీకి ఇప్పటి వరకు ఓవర్సీస్‌లో 1.17 మిలియన్ డాలర్లు (11 కోట్ల రూపాయలు) రాబట్టినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ఇప్పటి వరకు ప్రదీప్ రంగనాథన్ మూవీకి వరల్డ్ వైడ్‌గా 6 రోజుల వరకు 48.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూలైంది.

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ 7వ రోజు వసూళ్ల అంచనా
సోమవారం టెస్ట్‌లోనూ పాసైన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీకి బుధవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇండియాలో కేవంల 1.95 కోట్ల రూపాయల నెట్ మాత్రమే వసూలైంది. డెకాయిట్, పల్లిచట్టంబి, వజా 2 తదితర సినిమాల నుంచి ప్రదీప్ రంగనాథన్ మూవీకి గట్టి పోటీ ఎదురవుతోంది. గడిచిన 24 గంటల్లో ఈ సినిమాకు ఇండియాలో 18.76K టికెట్స్ బుక్ అయినట్లు బుక్ మై షో గణాంకాలు చెబుతున్నాయి. 7వ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు లవ్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇండియాలో 15 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీతో 1622 షోలు ప్రదర్శితమైనట్లు సాక్‌నిక్ నివేదించింది. తమిళంలో 1020 షోలు, తెలుగులో 600 షోలు రన్ అయ్యాయి.

ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఇండియాలో 7వ రోజు 38 లక్షల రూపాయల నికర వసూళ్లు రాబట్టాడు ప్రదీప్. గురువారం తమిళంలో 2 కోట్ల రూపాయలు, తెలుగులో 25 లక్షల రూపాయలు, కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియాలో 25 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 30 లక్షల రూపాయలు చొప్పున సోమవారం వరల్డ్ వైడ్‌గా 3 కోట్ల రూపాయలు వసూలు చేయొచ్చని అంచనా వేస్తున్నారు. ఈరోజు వసూళ్లతో కలిపి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ 50 కోట్ల రూపాయల మార్క్ చేరుకుంటుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X