LIK Day 9 Collections: దారుణంగా పడిపోయిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ వసూళ్లు.. ప్రదీప్ మూవీకి ఎంతంటే?

విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి జంటగా తెరకెక్కిన మూవీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై విక్కీ ఒరిజినల్‌గా రూపొందిన ఈ సినిమాను లలిత్ కుమార్ సమర్పిస్తున్నారు. ఈ సినిమాకు లేడీ సూపర్‌స్టార్ నయనతార నిర్మాతగా, ఎల్‌కే విష్ణు కుమార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎస్‌జే సూర్య, యోగిబాబు, శ్రీమాన్, గౌరీ కిషన్, మాళవిక తదితరులు కీలకపాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, రవి వర్మన్ సినిమాటోగ్రఫిని, ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటర్‌గా, టీ ముతురాజ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా విడుదలైంది. ఈ నేపథ్యంలో ప్రదీప్ రంగనాథన్ మూవీ బడ్జెడ్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? 9వ రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులతో కలిపి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీకి 65 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. ఈ సినిమాకు థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా అదే స్థాయిలో జరిగినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ లాభాల్లోకి రావాలంటే 62 కోట్ల రూపాయల షేర్.. 125 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. ఈ మూవీని తమిళనాడులో 350 స్క్రీన్లు, తెలుగులో 100 కుపైగా స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 300 స్క్రీన్లు సహా మొత్తంగా వరల్డ్ వైడ్‌గా 900 వరకు స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

Love Insurance Kompany Day 9 Expected Box Office Collections Worldwide Pradeep Ranganathan s records week performance

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ 8 రోజుల వసూళ్లు
లవ్ ఇన్సూరెన్స్ కంపెనీకి తొలిరోజున 7.05 కోట్ల రూపాయలు, రెండో రోజున 7.95 కోట్ల రూపాయలు, మూడో రోజు 7.50 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 3 కోట్ల రూపాయలు, ఐదో రోజున 4.15 కోట్ల రూపాయలు, ఆరవ రోజున 1.95 కోట్ల రూపాయలు, ఏడో రోజున 1.62 కోట్ల రూపాయలు, ఎనిమిద రోజున 96 లక్షల రూపాయలు వసూలు చేసింది. 8 రోజుల్లో ఇండియా వైడ్‌గా 34.56 కోట్ల రూపాయలు నెట్.. 40 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది.

తొలివారం తమిళనాడులో 27.13 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 3.69 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 8.54 కోట్ల రూపాయలు, కేరళలో 65 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 56 లక్షల రూపాయలు చొప్పున వసూలు చేసింది. అయితే తొలి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ వరల్డ్ వైడ్‌గా 54.3 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది.

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఓవర్సీస్ కలెక్షన్స్
శుక్రవారం వరకు లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ నార్త్ అమెరికాలో 240K డాలర్లు (2.36 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే, గల్ఫ్, సింగపూర్, మలేషియా తదితర దేశాలలో కలిపి ఓవర్సీస్‌లో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ 1.15 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 10.76 కోట్ల రూపాయలు) రాబట్టింది.

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ 9వ రోజు వసూళ్ల అంచనా
శుక్రవారం వరకు తన హవా చూపించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఫ్రైడ్ రిలీజ్‌లు గట్టి దెబ్బ కొట్టాయి. పల్లిచట్టంబి, డెకాయిట్, భూత్ బంగ్లా తదితర సినిమాలతో పాటు యూత్, వజా 2 సినిమాల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. దాంతో వసూళ్లు దారుణంగా పడిపోయాయి. 9వ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు ఇండియాలో ప్రదీప్ రంగనాథన్ మూవీకి ఇండియాలో 693 షోలు ప్రదర్శితమై... 20.5 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ పేర్కొంది. 9వ రోజు ఇప్పటి వరకు 38 లక్షల రూపాయల నెట్ వసూలు చేసినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

శనివారం తమిళంలో కోటి రూపాయలు, తెలుగులో 10 లక్షల రూపాయలు, కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియాలో 25 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 25 లక్షల రూపాయలు చొప్పున 9వ రోజు వరల్డ్ వైడ్‌గా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీకి 2 కోట్ల రూపాయలు వసూలు చేయొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రదీప్ రంగనాథన్ మూవీ ఇప్పటి వరకు బడ్జెట్ మీద 56.7 శాతం మాత్రమే రికవరీ సాధించినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. పరిస్ధితులు చూస్తుంటే ప్రదీప్ జోరుకు ఈ సినిమా బ్రేక్ వేసేలా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X