For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Love Story Day 1 Collections: చరిత్ర సృష్టించిన నాగ చైతన్య.. ఇండియాలోనే ఫస్ట్ మూవీగా సంచలన రికార్డు

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీపై కరోనా ప్రభావం భారీ స్థాయిలో పడిన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా సెకెండ్ వేవ్ తర్వాత విడుదలవుతోన్న సినిమా పరిస్థితి దారుణంగా ఉంది. టాక్ బాగున్నా ప్రేక్షకులు థియేటర్లకు రాలేకపోవడం.. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్ల ఇష్యూ ఉండడం వంటి పలు కారణాలతో చాలా సినిమాలు నష్టాలను ఎదుర్కొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాది 'వకీల్ సాబ్' తర్వాత భారీగా రిలీజ్ అయిన చిత్రం 'లవ్ స్టోరీ'. నాగ చైతన్య - సాయి పల్లవి జంటగా నటించిన ఈ మూవీకి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా కలెక్షన్లను కూడా రికార్డు స్థాయిలో రాబట్టింది. ఇక, ఈ మూవీ మొదటి రోజు బాక్సాఫీస్ రిపోర్టుపై మీరూ ఓ లుక్కేయండి!

     క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన ‘లవ్ స్టొరీ'

    క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన ‘లవ్ స్టొరీ'

    అక్కినేని నాగ చైతన్య - సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్ స్టోరీ'. క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలపై కే నారాయణదాస్ నారంగ్, పీ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. పవన్ సీహెచ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు. సున్నితమైన ప్రేమకథతో ఇది వచ్చింది.

    హాట్ హాట్ ఫోజులతో కాజల్ అగర్వాల్: పెళ్లైన తర్వాత తొలిసారి ఇంత ఘాటుగా.. ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు!

     భారీ అంచనాలు.. బిజినెస్ జరిగిందిలా

    భారీ అంచనాలు.. బిజినెస్ జరిగిందిలా

    ‘లవ్ స్టోరీ' మూవీపై ఆది నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీనికి దీని నుంచి విడుదలైన ప్రతి పాట, పోస్టర్, టీజర్, ట్రైలర్‌లు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. దీంతో ఈ చిత్రానికి బిజినెస్ కూడా భారీగా జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 31.20 కోట్లకు అమ్ముడుపోయింది. దీంతో సెకెండ్ వేవ్ తర్వాత భారీ బిజినెస్ చేసుకుంది.

    మొదటి రోజు ఎక్కడ ఎంత వచ్చాయి?

    మొదటి రోజు ఎక్కడ ఎంత వచ్చాయి?

    ‘లవ్ స్టోరీ' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 3.06 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.08 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 61 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 48 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 55 లక్షలు, గుంటూరులో రూ. 59 లక్షలు, కృష్ణాలో రూ. 32 లక్షలు, నెల్లూరులో రూ. 25 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 6.94 కోట్లు షేర్, రూ. 10.35 కోట్లు గ్రాస్ వచ్చింది.

    Samantha Naga Chaitanya Divorce: పెళ్లికి ముందే చెప్పిన వేణు స్వామి.. సమంతకు ఆ సమస్య అంటూ!

     ప్రపంచ వ్యాప్తంగా ఏ మేర రాబట్టింది?

    ప్రపంచ వ్యాప్తంగా ఏ మేర రాబట్టింది?

    తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో రూ. 6.94 కోట్లు కొల్లగొట్టిన ‘లవ్ స్టోరీ' ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 32 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.40 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 9.66 కోట్లు షేర్‌తో పాటు రూ. 16.50 కోట్లు గ్రాస్ వచ్చింది. దీంతో ఎన్నో రికార్డులు నమోదయ్యాయి.

     బ్రేక్ ఈవెన్ టార్గెట్ అలా.. ఎంత రావాలి

    బ్రేక్ ఈవెన్ టార్గెట్ అలా.. ఎంత రావాలి

    నాగ చైతన్య - సాయి పల్లవి కాంబినేషన్‌లో వచ్చిన ‘లవ్ స్టోరీ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 31.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 32 కోట్లుగా నమోదైంది. ఇక, తొలి రోజు దీనికి రూ. 9.66 కోట్లు రాబట్టింది. అంటే మరో 22.34 కోట్లు వస్తే క్లీన్ హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది.

    నాగ చైతన్య పేరిట నేషనల్ రికార్డులు

    నాగ చైతన్య పేరిట నేషనల్ రికార్డులు

    ‘లవ్ స్టోరీ' మూవీకి మొదటి రోజే రూ. 11 కోట్లు గ్రాస్ వచ్చింది. దీంతో సెకెండ్ వేవ్ తర్వాత విడుదలైన చిత్రాల్లో ఎక్కువ వసూలు చేసిన మొదటి ఇండియన్ మూవీగా ఇది రికార్డు క్రియేట్ చేసింది. దీని తర్వాత ‘సీటీమార్' రూ. 5 కోట్లతో రెండో స్థానంలో.. ‘సాంగ్ చీ' రూ. 4.15 కోట్లతో మూడో స్థానంలో, ‘బెల్‌బాటమ్' రూ. 3.55 కోట్లతో నాలుగో స్థానంలో ఉన్నాయి.

    Bigg Boss: షొలో అర్ధరాత్రి వాళ్లిద్దరి రొమాన్స్.. పెదాలను తాకుతూ కొంటెగా.. అక్కడ కూడా కిస్ చేయమంటూ!

     ‘లవ్ స్టోరీ' పేరిట మరెన్నో రికార్డులు

    ‘లవ్ స్టోరీ' పేరిట మరెన్నో రికార్డులు

    మొదటి రోజు కలెక్షన్ల వర్షం కురిపించిన ‘లవ్ స్టోరీ' మూవీ పేరిట ఎన్నో రికార్డులు వచ్చి చేరాయి. టైర్ 2 హీరోల్లో ఓవర్సీస్‌లో ఎక్కువ సాధించిన చిత్రాల జాబితాలో ఇది 313K డాలర్లతో రెండో స్థానంలో నిలిచింది. ఫస్ట్ ప్లేస్‌లో ‘గీత గోవిందం' ఉంది. నైజాంలో ఎక్కువ వసూలు చేసిన మీడియం రేంజ్ చిత్రాల్లో ‘లవ్ స్టోరీ' మూవీ మూడో స్థానానికి చేరుకుంది.

    Bigg Boss: షోలో చెండాలమైన పని చేసిన హమీదా.. పర్సనల్ ఫొటోలను లీక్ చేసి ఝలక్ ఇచ్చిన ఫ్యాన్స్

    PSPK 27 : Nidhhi Agerwal To Star Opposite Pawan Kalyan In Periodic Drama
     వకీల్ సాబ్, ఉప్పెన తర్వాతి స్థానంలో

    వకీల్ సాబ్, ఉప్పెన తర్వాతి స్థానంలో

    ‘లవ్ స్టోరీ'కి తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.94 కోట్లు రావడంతో ఇది నాగ చైతన్య కెరీర్‌లోనే బెస్ట్ మూవీగా నిలిచింది. అలాగే, 2021 ఏడాదికి గానూ ‘వకీల్ సాబ్', ‘ఉప్పెన' తర్వాత భారీ వసూళ్లను రాబట్టిన చిత్రంగా రికార్డు సాధించింది. ఓవరాల్‌గా చూస్తే మీడియం రేంజ్ చిత్రాల జాబితాలో ఇది ఆరో స్థానంలో ఉంది. ఇలా ఎన్నో మరెన్నో రికార్డులు నమోదైపోయాయి.

    English summary
    Naga Chaitanya and Sai Pallavi Did Love Story Movie Under Sekhar Kammula Direction. This Movie Collect 9.66 Cr in First Day.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X