twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Love story Day 22 collections: పండగ రోజు కొత్త సినిమాలకు షాక్ ఇచ్చిన లవ్ స్టొరీ

    |

    శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమా మొత్తానికి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఒక విధంగా సెకండ్ అనంతరం అత్యధిక లాభాలను అందుకొని సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. నాగచైతన్య సాయి పల్లవి మొదటి సారి నటించిన ఈ సినిమా వారి కెరీర్లో కూడా మర్చిపోలేని విజయాన్ని అందించింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన వసూళ్లు మాత్రం 22వ రోజు కూడా బాగానే వచ్చాయి. ఒక విధంగా కొత్త సినిమాలకు పోటీపడుతూ ఒక్కసారిగా నెంబర్ ను పెంచుకోవడం అంటే సాధారణమైన విషయం కాదు. దసరా సెలవులు సినిమాకి సహాయ బాగానే హెల్ప్ అవుతున్నాయి.

    హౌస్ ఫుల్ బోర్డులు

    హౌస్ ఫుల్ బోర్డులు

    విజయదశమి సందర్భంగా మూడు సినిమాలు ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సిద్దార్థ్ శర్వానంద్ కలిసి నటించిన మహా సముద్రం సినిమా గురువారం భారీ స్థాయిలో విడుదలైంది. శనివారం రోజు అఖిల్ అక్కినేని నాలుగో సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అత్యధిక థియేటర్లలో విడుదల కాగా శ్రీకాంత్ తనయుడు రోషన్ పెళ్లి సందడి సినిమా లిమిటెడ్ థియేటర్స్ లో విడుదలైంది. ఇక ఈ పోటీలో లవ్ స్టోరీ సినిమా అంతగా సందడి చేయకపోవచ్చని అందరూ అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా పలు చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి.

    22వ రోజు మళ్ళీ పెరిగిన కలెక్షన్స్

    22వ రోజు మళ్ళీ పెరిగిన కలెక్షన్స్

    పోటీగా మూడు కొత్త సినిమాలను వచ్చినప్పటికీ లవ్ స్టోరీ సినిమా ఇదివరకు వచ్చిన వాళ్ళ కంటే కూడా 22వ రోజు కాస్త ఎక్కువ అందుకోవడం విశేషం. 21వ రోజు లవ్ స్టోరీ సినిమా 9లక్షల షేర్ ను అందుకోగా 22వ రోజు ఫెస్టివల్ కలిసి రావడంతో పలు చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. దీంతో ఏకంగా 18లక్షల షేర్ రావడం విశేషం.

    22రోజుల్లో వచ్చిన కలెక్షన్స్

    22రోజుల్లో వచ్చిన కలెక్షన్స్

    ఇక 22 రోజుల్లో వచ్చిన టోటల్ కలెక్షన్స్.. నైజాంలో రూ.12.47 కోట్లు, సీడెడ్‌లో రూ.4.41 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.3.08 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ.1.70 కోట్లు, వెస్ట్ గోదావరి జిల్లాలో 1.45 కోట్లు, గుంటూరులో రూ.1.57 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.1.48 కోట్లు, నెల్లూరు జిల్లాలో రూ 92 లక్షలు వసూలు చేసింది. లవ్ స్టొరీ సినిమా ఏపీ, తెలంగాణలో 22 రోజులకు గాను రూ.27.08 కోట్ల షేర్ అందుకొని, రూ.44.15 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.

    వరల్డ్ వైడ్ గా..

    వరల్డ్ వైడ్ గా..

    మిగిలిన రాష్ట్రాలలో కూడా కలెక్షన్స్ బాగానే వచ్చాయి. కర్ణాటక, ఇతర రాష్ట్రాలలో ఈ చిత్రం రూ .2.15 కోట్లు రాబట్టింది. ఓవర్సీస్ లో సుమారు రూ.4.90 కోట్లు అందుకున్నట్లు సమాచారం. ఇక వరల్డ్ వైడ్ గా లవ్ స్టొరీ మొత్తం 34.13కోట్ల షేర్ ను అందుకొని 61 కోట్ల గ్రాస్ ను దాటింది.

    ప్రాఫిట్స్ ఎంతంటే..

    ప్రాఫిట్స్ ఎంతంటే..

    లవ్ స్టొరీ వరల్డ్ వైడ్ గా రూ.31 కోట్లకుపైగా ప్రీ బిజినెస్ చేయగా ఇప్పటివరకు 34.13 కోట్ల షేర్ దక్కింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను దాటేసి ప్రస్తుతం 2.13కోట్లతో ప్రాఫిట్ లోకి వచ్చేసింది. ఏదేమైనా లవ్ స్టొరీ సినిమా పండగ రోజు కూడా పలుచోట్ల హౌస్ ఫుల్ బోర్డులతో దర్శనమివ్వడం విశేషం. ఇక శని ఆదివారం కూడా సినిమాకు మంచి వసూళ్లు దక్కే అవకాశం ఉంది.

    English summary
    Love story movie day 22 total box office collections,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X